సిగ్మాతెలుగు డాట్ కామ్ న్యూస్: నేడు, సోమవారం పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం కురెళ్ళగూడెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలూరు వైపు వస్తున్న కారును తాడేపల్లిగూడెం వైపు వెళ్తున్న కారు డివైడర్ పైనుంచి దూకి ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.