తాజా వార్తలు   కనుమ...గోపూజ మహోత్సవంలో సీఎం జగన్‌ | ఆంధ్ర ప్రదేశ్ లో332 ప్రాంతాలలోకరోనా వాక్సిన్లు వేస్తారు.. | వ్యానును టిప్పర్‌ లారీ ఢీ.. 11మంది మృతి | దేశంలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ రేపటినుండి ప్రారంభం | బుక్ చేసుకొన్నా గంటలో వంట గ్యాస్ సిలండర్ | శ్రీ ఆదిలక్ష్మి దేవి అవతారంలో శ్రీ మావుళ్ళమ్మ.. | గోదావరి జిల్లాలలో పందెపు కోడి కాలు దువ్వింది.. | శ్రీ మావుళ్ళమ్మ ఉత్సవాలు ప్రారంభం..హుండీ ఆదాయం | సంక్రాంతి శుభాకాంక్షలు..భీమవరం MLA గ్రంధి శ్రీనివాస్ | నా సర్వీసులో ఇటువంటి కుట్రలు చూడలేదు..డీజీపీ సవాంగ్ |

ఆంధ్ర ప్రదేశ్ కు కేంద్రం ఇచ్చిందేమిటి? కేటీఆర్ సూటి ప్రశ్న

Updated: November 23, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: భాగ్యనగరం ఎన్నికలలో ఆంధ్ర ఓటర్లు కూడా విశేషంగా పాల్గొంటారు. కాబ్బటి మంత్రి కేటీఆర్ వారికీ బీజేపీ చేసిన వాగ్దాన భంగాలను గుర్తుకు తెచ్చేపని లో ఉన్నారు. తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్‌ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడారు. బీజేపీ నేతల దగ్గర విషయం ఉండదని ,ఇచ్చిన మాటకు నిలబడరని బీజేపీ ఓట్ల కోసం మతం పేరుతో రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ నేతలకు దమ్ముంటే హైదరాబాద్‌కు లక్ష కోట్ల ప్యాకేజీ తీసుకురండని సవాల్ విసిరారు. దేశానికి, ప్రజలకు బీజేపీ చేసింది శూన్యమన్నారు. తెలంగాణకే కాదు..ఆంధ్రప్రదేశ్‌కు కూడా కేంద్రం ఏమీ చేయలేదని వ్యాఖ్యానించారు. ఏపీ కి కొత్తరాజధాని అమరావతికి  కేంద్రం ఇచ్చిందేమీలేదని చెప్పారు. శంకుస్థాపన సమయంలో కాస్త నీళ్లు, మట్టి మాత్రమే కేంద్రం ఇచ్చిందన్నారు. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రం ఇచ్చిన హామీలు ఏవి నిలబెట్టుకోలేదని గుర్తుచేసుకోవాలన్నారు. తెలంగాణలో కూడా బీజేపీ నేతలు  ప్రజలకు భ్రమలు కలిపిస్తున్నారని విమర్శించారు. 

 
 

Related Stories