తాజా వార్తలు   కనుమ...గోపూజ మహోత్సవంలో సీఎం జగన్‌ | ఆంధ్ర ప్రదేశ్ లో332 ప్రాంతాలలోకరోనా వాక్సిన్లు వేస్తారు.. | వ్యానును టిప్పర్‌ లారీ ఢీ.. 11మంది మృతి | దేశంలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ రేపటినుండి ప్రారంభం | బుక్ చేసుకొన్నా గంటలో వంట గ్యాస్ సిలండర్ | శ్రీ ఆదిలక్ష్మి దేవి అవతారంలో శ్రీ మావుళ్ళమ్మ.. | గోదావరి జిల్లాలలో పందెపు కోడి కాలు దువ్వింది.. | శ్రీ మావుళ్ళమ్మ ఉత్సవాలు ప్రారంభం..హుండీ ఆదాయం | సంక్రాంతి శుభాకాంక్షలు..భీమవరం MLA గ్రంధి శ్రీనివాస్ | నా సర్వీసులో ఇటువంటి కుట్రలు చూడలేదు..డీజీపీ సవాంగ్ |

ఆ ‌హీరో తో 10 సినిమాలు చేస్తాను..అనిల్ రావిపూడి

Updated: November 23, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్ న్యూస్: కరోనా సమయంలో నవ్వుల వాక్సిన్ ఇస్తానంటూ ఎఫ్ 3 సినిమా షూటింగ్ కు సన్నద్దమౌతున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి.. వచ్చే వేసవి కి నవ్వులు పూయించాలని ఆయన తాపత్రయం. అనిల్ రావిపూడి మీడియాతో మాట్లాడుతూ... ఇక  నేను చేసిన ప్రతి సినిమాను ఆదరించిన ప్రేక్షకులు ఎఫ్‌2 సినిమాను ఏకంగా వాళ్లింట్లో పెట్టుకున్నారు. ఎఫ్‌ 2 ఇచ్చిన బ్యాంగ్‌ ఒకటి కాదు. ఆ సినిమా ఇండియన్‌ పనోరమకు సెలక్ట్‌ అయ్యింది. ఈ ఇంటర్నేషనల్‌ అవార్డుల్లో బెస్ట్‌ మూవీగా 'ఎఫ్‌2'కి, బెస్ట్‌ డైరెక్టర్‌గా నాకు అవార్డును సాధించింది. ఈ సినిమా తర్వాత సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబుగారితో 'సరిలేరు నీకెవ్వరు 'సినిమా చేసే అవకాశం రావడం.. 'ఎఫ్‌2' సినిమా నన్ను డైరెక్టర్‌గా నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకెళ్లిన గేమ్‌ ఛేంజర్‌.  సినిమా విడుదలైన తర్వాత దిల్‌రాజుగారు స్టేజ్‌ పై మాట్లాడుతూ మా ఎస్‌వీసీ బ్యానర్‌లోనే 'ఎఫ్‌2' సినిమా బిగ్గెస్ట్‌ ఫ్రాఫిటబుల్‌ మూవీ అని అనౌన్స్‌ చేశారు. అంత పెద్ద ప్రాఫిట్స్‌ నా నిర్మాతకు వస్తే డైరెక్టర్‌గా నాకంత కంటే ఆనందమేముంది. ఈ సినిమా సమయంలో వెంకటేశ్‌గారితో జర్నీ చేయడం.. నా అదృష్టం. చిన్నప్పటి నుండి ఆయన సినిమాలు చూస్తూ వచ్చాను. తర్వాత ఆయన్ని డైరెక్ట్‌ చేయడం ఓ ఫ్యాన్‌ బాయ్‌ మూమెంట్‌గా అనిపించింది. ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు పది సినిమాలైనా చేస్తాను. అంత కంఫర్టబుల్‌ హీరో. చాలా స్వీట్‌ పర్సన్‌. జెన్యూన్‌ హీరో. అన్నారు, 

 
 

Related Stories