సిగ్మాతెలుగు డాట్ కామ్ న్యూస్::ప్రముఖ సీనియర్ సినీ నటి, తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌గా ఉన్న మాజీ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్‌కు రామ్ రామ్.. చెప్పి బీజేపీ లో చేరటానికి ఢిల్లీ చేరుకొన్నారు. అధికారికంగా రేపు మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో రాములమ్మ బీజేపీలో చేరుతున్నారు. చాల కాలంగా కాంగ్రెస్ పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్న ఆమె పార్టీకి గుడ్‌బై చెప్పారు. త్వరలోనే విజయశాంతి బీజేపీలో చేరుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. తదుపరి ఆమె గ్రేటర్లో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. విజయ శాంతి 2 దశాబ్దాల క్రితం మొదట బీజేపీ పార్టీలో రాజకీయ జీవితం ప్రారంభించి, తదుపరి, తల్లి తెలంగాణ పార్టీ స్థాపించి, మరల ఆ పార్టీని టీఆరెస్ లో విలీనం చేసి 2 పర్యాయాలు ఎంపీగా గెలచి, ఒకమారు ఓడిపోయారు. తదుపరి కాంగ్రెస్ చేరి, తాజాగా తిరిగి స్వంత గూటికి చేరుకొంటున్నారు.