తాజా వార్తలు   కనుమ...గోపూజ మహోత్సవంలో సీఎం జగన్‌ | ఆంధ్ర ప్రదేశ్ లో332 ప్రాంతాలలోకరోనా వాక్సిన్లు వేస్తారు.. | వ్యానును టిప్పర్‌ లారీ ఢీ.. 11మంది మృతి | దేశంలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ రేపటినుండి ప్రారంభం | బుక్ చేసుకొన్నా గంటలో వంట గ్యాస్ సిలండర్ | శ్రీ ఆదిలక్ష్మి దేవి అవతారంలో శ్రీ మావుళ్ళమ్మ.. | గోదావరి జిల్లాలలో పందెపు కోడి కాలు దువ్వింది.. | శ్రీ మావుళ్ళమ్మ ఉత్సవాలు ప్రారంభం..హుండీ ఆదాయం | సంక్రాంతి శుభాకాంక్షలు..భీమవరం MLA గ్రంధి శ్రీనివాస్ | నా సర్వీసులో ఇటువంటి కుట్రలు చూడలేదు..డీజీపీ సవాంగ్ |

కరోనా కేసులు పెరుగుతుంటే ఏమి చేస్తున్నారు?..సుప్రీం

Updated: November 23, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్ న్యూస్: దేశ వ్యాప్తంగా 2వ విడుత కరోనా వైరస్  విజృంభణ నేపథ్యంలో గుజరాత్‌, ఢిల్లీ సర్కారుపై  నేడు, సోమవారం సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కోవిడ్‌-19 కట్టడికై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో నివేదిక అందించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. చలి కాలంలో చల్ల గాలికి కరోనా మరింత విజృంభించే అవకాశం ఉండటంతో డిసెంబరులో పరిస్థితులు దిగజారకముందే జాగ్రత్తపడాలని సూచించింది. ఈ రెండు రాష్ట్రాలతో పాటు మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఇదే తరహా ఆదేశాలు జారీ చేసింది. ‘‘ఈ నెలలో కరోనా కేసులు భారీ స్థాయిలో పెరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుత కోవిడ్‌ పరిస్థితిపై రాష్ట్రాలన్నీ నివేదిక అందజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.ఈ మేరకు రెండు రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని  మహమ్మారిపై యుద్ధానికి పూర్తిస్థాయిలో సన్నద్ధం కాకపోతే డిసెంబరులో అత్యంత ఘోరమైన, విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని ధర్మాసనం పేర్కొంది.

 
 

Related Stories