తాజా వార్తలు   కనుమ...గోపూజ మహోత్సవంలో సీఎం జగన్‌ | ఆంధ్ర ప్రదేశ్ లో332 ప్రాంతాలలోకరోనా వాక్సిన్లు వేస్తారు.. | వ్యానును టిప్పర్‌ లారీ ఢీ.. 11మంది మృతి | దేశంలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ రేపటినుండి ప్రారంభం | బుక్ చేసుకొన్నా గంటలో వంట గ్యాస్ సిలండర్ | శ్రీ ఆదిలక్ష్మి దేవి అవతారంలో శ్రీ మావుళ్ళమ్మ.. | గోదావరి జిల్లాలలో పందెపు కోడి కాలు దువ్వింది.. | శ్రీ మావుళ్ళమ్మ ఉత్సవాలు ప్రారంభం..హుండీ ఆదాయం | సంక్రాంతి శుభాకాంక్షలు..భీమవరం MLA గ్రంధి శ్రీనివాస్ | నా సర్వీసులో ఇటువంటి కుట్రలు చూడలేదు..డీజీపీ సవాంగ్ |

‌హైదరాబాద్ బ్రాండ్ ఏ ప్రభుత్వానికి చెందదు..కేటీఆర్

Updated: November 22, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్ న్యూస్: హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్ వారు నేడు, ఆదివారం నిర్వహించిన  బ్రాండ్ హైదరాబాద్ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి కేటీఆర్  సభికులను ఉద్దేశించి మాట్లాడుతూ.. నిజానికి  ‌హైదరాబాద్ బ్రాండ్ ఏ పార్టీకి, ఏ ప్రభుత్వానికి కాదని, భాగ్యనగరానికి 400 ఏళ్ల చరిత్ర ఉందని తెలిపారు ప్రపంచ వ్యాప్తంగా అందరినీ హైదరాబాద్ ఆకర్షిస్తోందని, ఆరేళ్ల కింద హైదరాబాద్‌లో అనేక సమస్యలు ఉండేవన్నారు. హైదరాబాద్‌లో గొడవలు వద్దు అభివృద్ధి కావడమే తమ లక్ష్యమని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రతీ బిడ్డ తెలంగాణ గడ్డకు చెందినవాడే అని సీఎం కేసీఆర్ ఆనాడే చెప్పారని గుర్తుచేశారు. గురినోయిడా, ఘజియాబాద్ లాంటి ప్రాంతాలు కాదని హైదరాబాద్‌కు పెట్టుబడులు ఎందుకు వస్తున్నాయో ఆలోచించాలన్నారు. ఇన్నోవేషన్ మీద దృష్టి పెట్టామని, ఐదు టాప్ ఫైవ్ కంపెనీలు గూగుల్‌, యాపిల్, మైక్రోసాఫ్ట్, అమేజాన్‌, ఫేస్‌బుక్ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాయని ఆయన గుర్తు చేశారు..ఈ కార్యక్రమంలో హైసియా అధ్యక్షుడు మోడరేటర్‌గా వ్యవహరించారు

 
 

Related Stories