తాజా వార్తలు   పశ్చిమ గోదావరి,గ్రామాలలోఇంటింటికి రేషన్‌ ప్రారంభం | బాలకృష్ణ ఫై, తొలిసారి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు | బెజవాడలోటీడీపీలో రచ్చ..ఎవడో గొట్టంగాడు చెబితే..బుద్ధా | ముత్తూట్‌ గ్రూప్‌ చైర్మన్, జార్జ్ ఆకస్మిక దుర్మరణం | హిందూపురంలో బాలకృష్ణ రోడ్డు షో..జనం కావాలి.. | గంటా.. వైసిపికి ప్రతిపాదన పెట్టారు..ఎంపీ విజయసాయి | ప గోదావరి జిల్లాలో చిన తిరుమల హుండీ ఆదాయం.. | వాహనదారులకు శుభవార్త..ఆన్‌లైన్‌లో ఆర్టీఓ సేవలు | BPL క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ | భీమవరంలో బంద్..పార్టీలు.. ర్యాలీల కోలాహలం |

పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చిన అరబ్‌ ఎమిరేట్స్‌

Updated: November 23, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్ న్యూస్ : భారత్ లో ఉగ్రవాదానికి పరోక్షంగా కొమ్ముకాస్తూ..  గత కొంత కాలంగా ఆర్ధికంగా, విదేశాంగ విధానంలో బాగా వెనుకబడిపోయిన, పాకిస్తాన్‌కు కరోనా కట్టడి నేపథ్యంలో యూనైటేడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ఊహించని షాక్‌ ఇచ్చింది. పాక్‌ నుంచి వస్తున్న సందర్శకులకు వీసాలను రద్దు చేస్తున్నట్లు యూఏఈ ప్రకటించింది. పాక్‌తో పాటు మరో 11 దేశాల వీసాలను సైతం నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్థానిక ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తీసుకున్నట్లు తెలిపింది. పాకిస్తాన్‌తో పాటు 11 దేశాల వీసాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రమాదం తో  ప్రాన్స్‌తో పాటు, లండన్‌ ఇప్పటికే రెండో విడత లాక్‌డౌన్‌ విధించాయి. మరొకొన్ని దేశాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి.

 
 

Related Stories