తాజా వార్తలు   ఆంధ్ర ప్రదేశ్ లో 3 రోజుల పాటు వర్ష సూచన | మలమూత్ర విసర్జన రహిత పట్టణంగా భీమవరం..స్వచ్ఛ | ఆంధ్ర ప్రదేశ్ కు కేంద్రం ఇచ్చిందేమిటి? కేటీఆర్ సూటి ప్రశ్న | రాజమండ్రిలో ఒకే కుటుంబంలో 4 ఆత్మహత్యలు | ఆ ‌హీరో తో 10 సినిమాలు చేస్తాను..అనిల్ రావిపూడి | తిరిగి బీజేపీ లో చేరిపోయిన రాములమ్మ... | కరోనా కేసులు పెరుగుతుంటే ఏమి చేస్తున్నారు?..సుప్రీం | అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ ను గుర్తించం.. రష్యా | ‌హైదరాబాద్ బ్రాండ్ ఏ ప్రభుత్వానికి చెందదు..కేటీఆర్ | ఆంధ్ర ప్రదేశ్లో ఈ 23 నుంచి క్రింది తరగతులు.. |

మోడీ, చంద్రబాబు ఒప్పందమే పోలవరానికి నష్టం..ఉండవల్లి

Updated: October 30, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్ న్యూస్: మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ..పోలవరం విషయంలో మోడీ ప్రభుత్వం మాట తప్పుతుందని,.. అయితే  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు  అధికారంలో ఉన్నప్పుడు పోలవరం విషయంలో రాజీ పడడంతోనే తీవ్ర నష్టం జరిగిందని వ్యాఖ్యానించారు. పోలవరానికి ఇవ్వాల్సిన ఖర్చు వందకు వందశాతం భరిస్తామని భరోసా కేంద్ర చట్టంలో ఉన్నా,చంద్రబాబు కాంప్రమైజ్ అయ్యారని, స్పెషల్ ప్యాకేజి పేరుతో సరిపెట్టుకున్నారని ఆయన చెప్పారు. పునరాసం తో సహా మొత్తం ప్రాజెక్టును కేంద్రం నిర్మించాలని, ఈ మేరకు చట్టంలో స్వష్టంగా ఉందన్నారు.పార్లమెంటులో చేసిన చట్టం గొప్పదా, మోదీ- చంద్రబాబు చేసుకున్న ఒప్పందం గొప్పదా? అని ప్రశ్నించారు. ఆనాడు  పట్టిసీమ మీద పెట్టిన ఖర్చు పోలవరంపై ఖర్చు పెడితే ఈ పాటికి పోలవరం ఆనకట్ట పూర్తయ్యేది. గ్రావిటీ మీద నీరు పంపించే అవకాశం ఉండేది’’ అని ఉండవల్లి వ్యాఖ్యానించారు.
 
 
 

Related Stories