తాజా వార్తలు   ఆంధ్ర ప్రదేశ్ లో 3 రోజుల పాటు వర్ష సూచన | మలమూత్ర విసర్జన రహిత పట్టణంగా భీమవరం..స్వచ్ఛ | ఆంధ్ర ప్రదేశ్ కు కేంద్రం ఇచ్చిందేమిటి? కేటీఆర్ సూటి ప్రశ్న | రాజమండ్రిలో ఒకే కుటుంబంలో 4 ఆత్మహత్యలు | ఆ ‌హీరో తో 10 సినిమాలు చేస్తాను..అనిల్ రావిపూడి | తిరిగి బీజేపీ లో చేరిపోయిన రాములమ్మ... | కరోనా కేసులు పెరుగుతుంటే ఏమి చేస్తున్నారు?..సుప్రీం | అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ ను గుర్తించం.. రష్యా | ‌హైదరాబాద్ బ్రాండ్ ఏ ప్రభుత్వానికి చెందదు..కేటీఆర్ | ఆంధ్ర ప్రదేశ్లో ఈ 23 నుంచి క్రింది తరగతులు.. |

పాకిస్తాన్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సౌదీ..

Updated: November 2, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్ న్యూస్:  పాకిస్థాన్‌తో దూరంగా దూరంగా జరుగుతున్నా సౌదీ అరేబియా, ఆ దేశానికి దిమ్మతిరిగిపోయే షాక్‌ ఇచ్చింది. పరోక్షంగా భారత్ సుదీర్ఘ కాలంగా చేస్తున్న వాదనను బలపరచింది. తాజా వార్తాకథనాలు ప్రకారం..భారత్ నుండి పాకిస్తాన్ ఆక్రమించిన భూభాగం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే), గిల్గిత్‌-బల్టిస్థాన్‌లను పాకిస్థాన్‌ మ్యాప్‌ నుంచి తొలగించింది. వచ్చేనెల 21-22 తేదీల్లో రియాద్‌ వేదికగా జీ-20 దేశాల సదస్సు జరుగనుంది. ఈ సందర్భంగా ప్రపంచ పటంలోని జీ-20 సభ్య దేశాలను డార్క్‌షేడ్‌తో గుర్తించి ఒక పత్రాన్ని సౌదీ రూపొందించింది. అయితే పీవోకే, బల్టిస్థాన్‌లు లేకుండానే పాకిస్థాన్‌ సరిహద్దులను డార్క్‌షేడ్‌ చేసింది. అయితే ఈ పరిణామంపై పాక్‌ ఇంకా స్పందించలేదు.

 
 

Related Stories