తాజా వార్తలు   ఆంధ్ర ప్రదేశ్ లో 3 రోజుల పాటు వర్ష సూచన | మలమూత్ర విసర్జన రహిత పట్టణంగా భీమవరం..స్వచ్ఛ | ఆంధ్ర ప్రదేశ్ కు కేంద్రం ఇచ్చిందేమిటి? కేటీఆర్ సూటి ప్రశ్న | రాజమండ్రిలో ఒకే కుటుంబంలో 4 ఆత్మహత్యలు | ఆ ‌హీరో తో 10 సినిమాలు చేస్తాను..అనిల్ రావిపూడి | తిరిగి బీజేపీ లో చేరిపోయిన రాములమ్మ... | కరోనా కేసులు పెరుగుతుంటే ఏమి చేస్తున్నారు?..సుప్రీం | అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ ను గుర్తించం.. రష్యా | ‌హైదరాబాద్ బ్రాండ్ ఏ ప్రభుత్వానికి చెందదు..కేటీఆర్ | ఆంధ్ర ప్రదేశ్లో ఈ 23 నుంచి క్రింది తరగతులు.. |

స్వయం ప్రతిపత్తి తాకట్టు పెట్టారు..అంబటి తీవ్ర విమర్శలు

Updated: October 28, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్ న్యూస్: వైసిపి అధికార ప్రతినిధి , ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. ఆయన నేటి బుధవారం సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలను పిలిచి ఎన్నికలపై అభిప్రాయాలు తీసుకుంది. ఈ సమావేశానికి మేం వెళ్లడం లేదని, బహిష్కరిస్తున్నామని నిన్ననే స్పష్టంగా చెప్పాం. ఈసీ  తాజగా విడుదల చేసిన నోట్‌లో మేము చేసిన వ్యాఖ్యలపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థని ఒక రాజకీయ పార్టీకి తాకట్టు పెట్టారు. ఇదే ప్రక్రియను ఎన్నికలు వాయిదా వేసిన సమయంలో ఎందుకు పాటించలేదు.ఎన్నికల ప్రక్రియ ప్రారంభించే ముందు ప్రభుత్వాన్ని సంప్రదించాలని సుప్రీంకోర్టు చెప్పింది. రాజకీయ పక్షాలతో మాట్లాడాలనే నిర్ణయానికి ముందే ఎందుకు ప్రభుత్వంతో చర్చించలేదు. ఆ రోజు కేవలం మూడు, నాలుగు కరోనా కేసులు ఉంటే ఇవాళ 3వేల కేసులు ఉన్నాయి. ఎన్నికలు జరగాలని, ఆ ప్రక్రియను ప్రారంభిస్తే మీరు అర్థాంతరంగా వాయిదా వేశారు. ఇది ఎన్నికల కమిషన్‌ కాదు.. చంద్రబాబు-నిమ్మగడ్డ కమిషన్‌గా మిగిలారు అని తీవ్ర విమర్శలు చేసారు అంబటి రాంబాబు. 

 
 

Related Stories