తాజా వార్తలు   ప్రత్యేక ఆహ్వానితుల జీవోల సస్పెండ్.. ఎంపీ రఘురామ | ఆల్ ఇన్ వన్..అడవిబాపిరాజు జయంతి భీమవరంలో | ఐటి దాడులవెనుక ఎవరున్నారో తెలుసు .సోను సూద్ | సోనీ టీవీలో..జీ ఎంటర్‌ టైన్మెంట్‌ విలీనం..సంచలనం | భీమవరంలో గురజాడ 159 వ జయంతి సభలు | వాణిజ్య ఉత్సవ్‌ 2021 ప్రారంభించిన సీఎం జగన్ | కాల్వలోకి కారు..ఇద్దరు భీమవరం యువకులు ?మృతి | కొవ్వూరు గోదావరిలో దూకిన వృద్ధ దంపతులు.. | 24, 25 తేదీల్లో ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నుకొనే పద్దతి | ప్రధాని మోడీ అమెరికా పర్యటన..24న జోబైడెన్‌ తోచర్చలు |

అమెరికా వైట్ హౌస్ దీపావళి వేడుకలలో ట్రంప్ జోష్

Updated: November 16, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్ న్యూస్: దీపావళి వేడుకలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఘనంగా జరుపుకున్నారు. వైట్‌హౌస్‌లో నిర్వహించిన ఈ వేడుకల్లో ట్రంప్‌ సతీసమేతంగా పాల్గొన్నారు. భారతీయ అమెరికన్లు, అధికారులతో కలిసి దీపాలు వెలిగించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ.. అమెరికా చాలా నమ్మకమైన దేశమని, ప్రతిఒక్కరు అమెరికన్‌ రాజ్యాంగబద్దంగా స్వేచ్ఛగా జీవించేలా తన పాలన కొనసాగినందుకు గర్విస్తున్నానని తెలిపారు. దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగ జరుపుకుంటామని గుర్తుచేశారు. ప్రజలంతా మతాలకు అతీతంగా స్వేచ్ఛగా జీవించాలని ఆకాంక్షించారు. అమెరికా త‌దుప‌రి అధ్య‌క్షుడిగా ఎన్నికైన జో బైడెన్ కూడా దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలిపారు.

 
 

Related Stories