తాజా వార్తలు   భీమవరంకు పొంచి ఉన్న యనమదుర్రు వరద ముప్పు.. | అల్పపీడనం ..రేపు కోస్తా ఆంధ్రలోభారీ వర్షాలు | శుభవార్త.. దక్షిణ మధ్య రైల్వే..మరో 900 ప్రత్యేక రైళ్లు | శ్రీ గాయత్రీ దేవిగా శ్రీ మావుళ్ళమ్మవారు..భక్తుల రద్దీ | సీఎం కెసిఆర్ దత్తపుత్రిక నిశ్చితార్థం..ఒక స్ఫూర్తి గాధ | ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ అధ్యక్షుడిగా..అచ్చెన్నాయుడు | భీమవరం MLA చేతుల మీదుగా ఎలక్ట్రికల్ వాహనాల బ్రోచర్ | ఏపీలో 56 బీసీ కార్పొరేషన్లు..భీమవరంలో సంబరాలు | అమ్మ..అరగుండు..నాగార్జున వికృత చేష్ట..బిగ్ బాస్ లో | హైదరాబాద్ ను వదలని వర్షం..మరల మూసి ఉగ్రరూపం |

తెలుగు సినీ హీరో సచిన్ జోషి అరెస్ట్

Updated: October 16, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్ న్యూస్: గుట్కా అక్రమ రవాణా కేసులో తెలుగు , హిందీ చిత్రాల  సినీ హీరో , నిర్మాత, వ్యాపార‌వేత్త సచిన్‌ జోషిని హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పాన్‌ మసాలాల ముసుగులో నిషేధిత గుట్కాలు తయారీ, సరఫరా చేస్తున్న ఆరోపణపై ఆయనను ముంబై విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్‌ నుంచి ముంబైకి వచ్చిన సచిన్‌ జోషిని నిర్బంధంలోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. కాగా హైదరాబాద్‌కు అక్రమంగా గుట్కా తరలింపులో సచిన్‌ జోషి హస్తమున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఆయనపై ఐపీసీ 273,336 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తెలుగు లో 5 చిత్రాల్లో హీరోగా సచిన్ నటించారు.  గతంలో నిర్మాత బండ్ల గణేష్ కు సచిన్ కు మధ్య జరిగిన ఆర్ధిక లావాదేవీల  వివాదం పెద్ద సంచలనం అయ్యింది

 
 

Related Stories