తాజా వార్తలు   భీమవరంకు పొంచి ఉన్న యనమదుర్రు వరద ముప్పు.. | అల్పపీడనం ..రేపు కోస్తా ఆంధ్రలోభారీ వర్షాలు | శుభవార్త.. దక్షిణ మధ్య రైల్వే..మరో 900 ప్రత్యేక రైళ్లు | శ్రీ గాయత్రీ దేవిగా శ్రీ మావుళ్ళమ్మవారు..భక్తుల రద్దీ | సీఎం కెసిఆర్ దత్తపుత్రిక నిశ్చితార్థం..ఒక స్ఫూర్తి గాధ | ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ అధ్యక్షుడిగా..అచ్చెన్నాయుడు | భీమవరం MLA చేతుల మీదుగా ఎలక్ట్రికల్ వాహనాల బ్రోచర్ | ఏపీలో 56 బీసీ కార్పొరేషన్లు..భీమవరంలో సంబరాలు | అమ్మ..అరగుండు..నాగార్జున వికృత చేష్ట..బిగ్ బాస్ లో | హైదరాబాద్ ను వదలని వర్షం..మరల మూసి ఉగ్రరూపం |

shocking ..మాజీ తహశీల్దార్ నాగరాజు ఆత్మహత్య

Updated: October 16, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్ న్యూస్: మాజీ తహశీల్దార్ నాగరాజు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గతంలో కోటి పది లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేసి ఆయన ఏసీబీకి అడ్డంగా చిక్కిన విషయం.. ఆ భారీ డబ్బు నోట్లు లెక్కపెడుతున్న అదికారులు.. వాటి ఫొటోలతో ఉభయ తెలుగు రాష్ట్రాలలో సోషల్ మీడియాలో ఈయన విస్తృత ప్రాచుర్యంలోకి వచ్చారు. ప్రస్తుతం చెంచల్‌గూడ జైల్లో ఉన్న నాగరాజు.. మానసిక వేదనతో  జైల్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు అని భావిస్తున్నారు.  గతంలో నాగరాజు వద్ద భారీ మొత్తంలో డబ్బుతో పాటు, అనేక పత్రాలను  ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.నాగరాజు కారులో రూ. 8 లక్షలు, అతని ఇంట్లో రూ.28 లక్షల నగదును సీజ్ చేశారు. అలాగే 500 గ్రాముల బంగారు ఆభరణాలు, లాకర్ కీ ఏసీబీ అధికారులకు దొరికాయి. అనేక స్థిరాస్తులు సోదాల్లో బయట పడటం గమనార్హం .. 
 
 
 

Related Stories