తాజా వార్తలు   భీమవరంకు పొంచి ఉన్న యనమదుర్రు వరద ముప్పు.. | అల్పపీడనం ..రేపు కోస్తా ఆంధ్రలోభారీ వర్షాలు | శుభవార్త.. దక్షిణ మధ్య రైల్వే..మరో 900 ప్రత్యేక రైళ్లు | శ్రీ గాయత్రీ దేవిగా శ్రీ మావుళ్ళమ్మవారు..భక్తుల రద్దీ | సీఎం కెసిఆర్ దత్తపుత్రిక నిశ్చితార్థం..ఒక స్ఫూర్తి గాధ | ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ అధ్యక్షుడిగా..అచ్చెన్నాయుడు | భీమవరం MLA చేతుల మీదుగా ఎలక్ట్రికల్ వాహనాల బ్రోచర్ | ఏపీలో 56 బీసీ కార్పొరేషన్లు..భీమవరంలో సంబరాలు | అమ్మ..అరగుండు..నాగార్జున వికృత చేష్ట..బిగ్ బాస్ లో | హైదరాబాద్ ను వదలని వర్షం..మరల మూసి ఉగ్రరూపం |

ఉల్లి ధరలు ఎందుకు పెరుగుతున్నాయి..ఎంతవరకు?

Updated: October 16, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్ న్యూస్: ఈ కరోనా కష్ట సమయంలో అన్ని నిత్యావసర వస్తువుల ధరలతో పాటుమరల  దేశవ్యాప్తంగా ఉల్లి పాయ ధరలు పెరిగిపోతున్నాయి. అధిక వర్షాలకు పంట దెబ్బతినడంతో హోల్‌సేల్‌ మార్కెట్‌కు వస్తున్న నాణ్యమైన  ఉల్లిని వ్యాపారులు కొంత బ్లాక్ చేస్తున్నారని సమాచారం వస్తుంది.  దీనితో ఉల్లి డిమాండ్ రానున్న రోజులలో మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. నిన్న మంగళవారం, ఏకంగా 32 వేల హెక్టార్లలో ఉల్లి సాగుచేసే ప్రాంతం  కర్నూలు మార్కెట్‌లో నాణ్యమైన ఉల్లికి క్వింటాలుకు రూ.3,830 ధర పలికింది.  ఉల్లి కి పెద్దమార్కెట్ అయిన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోనూ ఇదే పరిస్థితి. మార్కెట్లలోనూ సగటు ధర రూ.2,000 వరకు ఉంది. రిటైల్‌ మార్కెట్‌లో నాణ్యమైన ఉల్లి కిలో రూ.45 నుంచి రూ.50 దాకా పలుకుతోంది. ఉల్లి రైతులు ఆనందంగా ఉన్నారు.అయితే  వినియోగదారులు మాత్రం  ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం  కేంద్ర ప్రభుత్వం విదేశాలకు ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. ఈ కారణంగా ఉల్లి ధర కిలో ఇప్పటికి రిటైల్‌ మార్కెట్‌లో రూ.50లోపే ఉంది. ఎగుమతులపై నిషేధం విధించకపోయుంటే ఇప్పటికే కిలో రూ.100 పలికేదని అధికారులు అంటున్నారు. డిసెంబర్ నెలలో కొత్త పంట వస్తుంది కాబ్బటి అప్పుడు ధరలు తగ్గే అవకాశం ఉంది. 
 
 
 

Related Stories