తాజా వార్తలు   ఆంధ్ర ప్రదేశ్ లో 3 రోజుల పాటు వర్ష సూచన | మలమూత్ర విసర్జన రహిత పట్టణంగా భీమవరం..స్వచ్ఛ | ఆంధ్ర ప్రదేశ్ కు కేంద్రం ఇచ్చిందేమిటి? కేటీఆర్ సూటి ప్రశ్న | రాజమండ్రిలో ఒకే కుటుంబంలో 4 ఆత్మహత్యలు | ఆ ‌హీరో తో 10 సినిమాలు చేస్తాను..అనిల్ రావిపూడి | తిరిగి బీజేపీ లో చేరిపోయిన రాములమ్మ... | కరోనా కేసులు పెరుగుతుంటే ఏమి చేస్తున్నారు?..సుప్రీం | అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ ను గుర్తించం.. రష్యా | ‌హైదరాబాద్ బ్రాండ్ ఏ ప్రభుత్వానికి చెందదు..కేటీఆర్ | ఆంధ్ర ప్రదేశ్లో ఈ 23 నుంచి క్రింది తరగతులు.. |

ఏపీలో 56 బీసీ కార్పొరేషన్లు..భీమవరంలో సంబరాలు

Updated: October 18, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో బీసీల అభివృద్ధి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ సీఎం జగన్  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. వైఎస్సార్‌, జ్యోతిరావుపూలే విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యే జోగి రమేష్‌, తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు చరిత్రలో నిలిచిపోయే రోజు దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీసీలకు సీఎం జగన్‌ 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. చంద్రబాబు  బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారే తప్ప చేసిందేమి లేదని విమర్శించారు. భీమవరంలో  కామన నాగేశ్వర రావు ఆధ్వర్యంలో బీసీ నేతలు సీఎం జగన్, ఎంఎల్ఏ గ్రంధి శ్రీనివాస్ ఫ్లెక్సీలు  తో పట్టణ వీధులలో  ఊరేగింపు నిర్వహించారు. ప్రకాశం చౌక్ సెంటర్లో మాట్లాడుతూ..  బీసీల కార్పొరేషన్లు ఏర్పాటు చేసినందుకు , పశ్చిమ నేతలకు ఇందులో తగిన ప్రాధాన్యత నిచ్చినందుకు సీఎం కు కృతజ్ఞతలు తెలిపారు. 
 
 

Related Stories