తాజా వార్తలు   ఆంధ్ర ప్రదేశ్ లో 3 రోజుల పాటు వర్ష సూచన | మలమూత్ర విసర్జన రహిత పట్టణంగా భీమవరం..స్వచ్ఛ | ఆంధ్ర ప్రదేశ్ కు కేంద్రం ఇచ్చిందేమిటి? కేటీఆర్ సూటి ప్రశ్న | రాజమండ్రిలో ఒకే కుటుంబంలో 4 ఆత్మహత్యలు | ఆ ‌హీరో తో 10 సినిమాలు చేస్తాను..అనిల్ రావిపూడి | తిరిగి బీజేపీ లో చేరిపోయిన రాములమ్మ... | కరోనా కేసులు పెరుగుతుంటే ఏమి చేస్తున్నారు?..సుప్రీం | అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ ను గుర్తించం.. రష్యా | ‌హైదరాబాద్ బ్రాండ్ ఏ ప్రభుత్వానికి చెందదు..కేటీఆర్ | ఆంధ్ర ప్రదేశ్లో ఈ 23 నుంచి క్రింది తరగతులు.. |

అమ్మ..అరగుండు..నాగార్జున వికృత చేష్ట..బిగ్ బాస్ లో

Updated: October 18, 2020

సిగ్మా తెలుగు డాట్ కామ్, న్యూస్: తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 లో హోస్ట్ గా నాగార్జున చలాకీగా షో కి బ్యాక్ బోన్ గా నిలిచారు.అయితే తాజా ఎపిసోడ్ లో నాగార్జున తన స్థాయికి తగని ' అరగుండు గొరిగించే'  పని ప్రోత్సహించి తన స్థాయి తగ్గించుకున్నారు. తెలుగు రాష్ట్రాలలో 'శిరోముండనం' ఎక్కడ చేయించిన ఎన్ని ఆందోళనలు చెలరేగుతాయో? అందరికి తెలుసు. మరి   బిగ్‌బాస్ డీల్స్‌లో ఇంటిస‌భ్యులు వ‌దిలేసిన ఒక డీల్‌ను ప‌ట్టుబ‌‌ట్టి నాగార్జున మ‌రీ చేయించారు. బ్లూ టీమ్ వ‌దిలేసిన అర‌గుండు డీల్ పూర్తి చేసిన‌వారికి త‌ర్వాతి వారం నామినేష‌న్ నుంచి సేఫ్ అయ్యే అవ‌కాశం ఉంటుంద‌ని నాగ్‌ ఆఫ‌ర్ ప్ర‌క‌టించారు. ఈ డీల్‌కు అమ్మ రాజ‌శేఖ‌ర్‌ ఒప్పుకోవ‌డంతో నోయ‌ల్ గుండు గీశాడు. త‌ల్లి కోసం చేయ‌ని త్యాగం బిగ్‌బాస్ కోసం చేశావ‌ని నాగ్‌‌ మాస్ట‌ర్‌ను పొగిడి, అర్ధనారీశ్వరుడు అంటూచప్పట్లు కొట్టించి  ఓదార్చడం చాల అసహ్యంగా  షో రేటింగ్ కోసం చేసిన ట్విస్టుగా కనపడింది.  టాప్ డాన్స్ మాస్టర్ గా , సినీ దర్శకుడిగా రణం, ఖతర్నాగ్, వంటి పలు సినిమాలకు దర్శకుడిగా పనిచేసి ఇటీవల బాగా వెనుకబడిన  అమ్మ రాజశేఖర్ లాంటి వ్యక్తి డీల్ ఒప్పుకోవడం, అతని  దీన మానసిక స్థితి  కనపడింది. ఆ సన్నివేశాలు అమ్మ.. కుటుంబసభ్యులు చుస్తే వారి మానసిక పరిస్థితి బిగ్ బాస్ నిర్వాకులు అంచనా వేసారా? ఇది  షో  నిర్వాకుల వికృత చేష్ట కాకా మరేమిటి?  బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలంటే  ఇటువంటి అవమానకరమైన  టాస్క్  లు చెయ్యాలా? ఇది వినోదమా ? ఇక ఈ వారం  ఓట్లు తక్కువ వచ్చిన ఏడుపులు  రాణి .. మోనాల్ గ‌జ్జ‌ర్‌ను కాద‌ని అన్యాయంగా కుమార్ సాయిని ఎలిమినేట్ చేసిన‌ట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలలో నిజమెంతో? ఏమైనా రహస్య టాస్క్ కావచ్చునేమో? చూడాలి.. 

 
 

Related Stories