తాజా వార్తలు   ఆంధ్ర ప్రదేశ్ లో 3 రోజుల పాటు వర్ష సూచన | మలమూత్ర విసర్జన రహిత పట్టణంగా భీమవరం..స్వచ్ఛ | ఆంధ్ర ప్రదేశ్ కు కేంద్రం ఇచ్చిందేమిటి? కేటీఆర్ సూటి ప్రశ్న | రాజమండ్రిలో ఒకే కుటుంబంలో 4 ఆత్మహత్యలు | ఆ ‌హీరో తో 10 సినిమాలు చేస్తాను..అనిల్ రావిపూడి | తిరిగి బీజేపీ లో చేరిపోయిన రాములమ్మ... | కరోనా కేసులు పెరుగుతుంటే ఏమి చేస్తున్నారు?..సుప్రీం | అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ ను గుర్తించం.. రష్యా | ‌హైదరాబాద్ బ్రాండ్ ఏ ప్రభుత్వానికి చెందదు..కేటీఆర్ | ఆంధ్ర ప్రదేశ్లో ఈ 23 నుంచి క్రింది తరగతులు.. |

హైదరాబాద్ ను వదలని వర్షం..మరల మూసి ఉగ్రరూపం

Updated: October 18, 2020

సిగ్మా తెలుగు డాట్ కామ్, న్యూస్: మరోసారి హైదరాబాద్ ను భారీ వర్షాలు కుమ్మేసాయి.  నిన్న రాత్రి నుండి నేటి ఆదివారం తెల్లవారుజాము వరకు ఏకబిగిగా కురిసిన 8 గంటల పైగా వర్షానికి  పాత  బస్తితో పాటు ఎత్తయిన ప్రాంతాలు ఉన్న కూకట్ పల్లి, బంజారా హిల్స్ , జూబ్లీ హిల్స్  వంటి ప్రాంతాలలో కూడా ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. మూసీ నది మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. ఛాదర్ ఘాట్ బ్రిడ్జితో సహా పక్కకు ఉన్న బస్తీలను మూసీ ముంచేసింది. 50కి పైగా పేదల ఇళ్లు వరద నీటిలో మునిగిపోయాయి. చదర్‌ఘాట్‌ నుండి మలక్‌పేట్‌, దిల్‌సుఖ్‌ నగర్‌ ప్రధాన రోడ్ బంద్ అయింది. ఆ పక్కనే ఉన్న బస్తీలు మొత్తం నీట మునిగిపోయాయి. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.హిమాయత్‌ సాగర్‌ నిండుకుండను తలపిస్తోంది నేడు,  ఏ క్షణమైన గేట్లు తెరిచే అవకాశం అయితే ఉంది. 

 
 

Related Stories