తాజా వార్తలు   భీమవరంకు పొంచి ఉన్న యనమదుర్రు వరద ముప్పు.. | అల్పపీడనం ..రేపు కోస్తా ఆంధ్రలోభారీ వర్షాలు | శుభవార్త.. దక్షిణ మధ్య రైల్వే..మరో 900 ప్రత్యేక రైళ్లు | శ్రీ గాయత్రీ దేవిగా శ్రీ మావుళ్ళమ్మవారు..భక్తుల రద్దీ | సీఎం కెసిఆర్ దత్తపుత్రిక నిశ్చితార్థం..ఒక స్ఫూర్తి గాధ | ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ అధ్యక్షుడిగా..అచ్చెన్నాయుడు | భీమవరం MLA చేతుల మీదుగా ఎలక్ట్రికల్ వాహనాల బ్రోచర్ | ఏపీలో 56 బీసీ కార్పొరేషన్లు..భీమవరంలో సంబరాలు | అమ్మ..అరగుండు..నాగార్జున వికృత చేష్ట..బిగ్ బాస్ లో | హైదరాబాద్ ను వదలని వర్షం..మరల మూసి ఉగ్రరూపం |

తెలుగు రాష్ట్రాలపై మరో అల్ప పీడనం ప్రభావం.. .

Updated: October 17, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్ న్యూస్: కొరోనా వైరస్ బాధలకు తోడు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు అల్ల కల్లోలం చేస్తున్నాయి. మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 19న మరో  అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఇది ఏర్పడిన 24 గంటల తర్వాత తీవ్ర అల్పపీడ నంగా మారే అవకాశముందని తెలిపింది. దీంతో రాష్ట్రంలో నేడు, రేపు పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ప్రస్తుతం ఉత్తర మహారాష్ట్ర తీరానికి దగ్గరలోని తూర్పు మధ్య అరేబియా సముద్రం, సమీప ప్రాం తాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. కాగా ప్రస్తుతం, కోస్తాంధ్ర, తెలంగాణ, ఉత్తర మహారాష్ట్ర తీరానికి దగ్గరలో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు తెలిపింది.   

 
 

Related Stories