తాజా వార్తలు   భీమవరంకు పొంచి ఉన్న యనమదుర్రు వరద ముప్పు.. | అల్పపీడనం ..రేపు కోస్తా ఆంధ్రలోభారీ వర్షాలు | శుభవార్త.. దక్షిణ మధ్య రైల్వే..మరో 900 ప్రత్యేక రైళ్లు | శ్రీ గాయత్రీ దేవిగా శ్రీ మావుళ్ళమ్మవారు..భక్తుల రద్దీ | సీఎం కెసిఆర్ దత్తపుత్రిక నిశ్చితార్థం..ఒక స్ఫూర్తి గాధ | ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ అధ్యక్షుడిగా..అచ్చెన్నాయుడు | భీమవరం MLA చేతుల మీదుగా ఎలక్ట్రికల్ వాహనాల బ్రోచర్ | ఏపీలో 56 బీసీ కార్పొరేషన్లు..భీమవరంలో సంబరాలు | అమ్మ..అరగుండు..నాగార్జున వికృత చేష్ట..బిగ్ బాస్ లో | హైదరాబాద్ ను వదలని వర్షం..మరల మూసి ఉగ్రరూపం |

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభం..దర్శన వివరాలు

Updated: October 17, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్ న్యూస్: దసరా నవ రాత్రి వేడుకలు నేడు, శనివారం దేశవ్యాప్తంగా ప్రారంభం అయిన నేపథ్యంలో విజయవాడ లోని  ఇంద్రకీలాద్రిపై వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేడు, అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు.అమ్మవారికి నగర సీపీ బత్తిన శ్రీనివాసులు,  దుర్గగుడి ఈవో సురేష్ బాబు దంపతులు తొలి పూజ నిర్వహించారు. కోవిద్ నిబంధనలు మేరకు.. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకున్న రోజుకు 10వేలమంది భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. అంతరాలయ దర్శనం లేదు.. దూరం నుంచే అమ్మవారిని దర్శించాలి. రోజు రాత్రి 8 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. అలాగే పదేళ్లలోపు పిల్లలకు, 60ఏళ్లు పైబడిన వారికి దర్శనానికి అనుమతి లేదు. అలాగే కేశఖండన, ఘాట్ల వద్ద స్నానాలు నిషేధం విధించారు, నేటి అమ్మవారి బంగారు తల్లి అలంకారం ఫై ఫొటోలో చుడండి. 

 
 

Related Stories