తాజా వార్తలు   భీమవరంకు పొంచి ఉన్న యనమదుర్రు వరద ముప్పు.. | అల్పపీడనం ..రేపు కోస్తా ఆంధ్రలోభారీ వర్షాలు | శుభవార్త.. దక్షిణ మధ్య రైల్వే..మరో 900 ప్రత్యేక రైళ్లు | శ్రీ గాయత్రీ దేవిగా శ్రీ మావుళ్ళమ్మవారు..భక్తుల రద్దీ | సీఎం కెసిఆర్ దత్తపుత్రిక నిశ్చితార్థం..ఒక స్ఫూర్తి గాధ | ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ అధ్యక్షుడిగా..అచ్చెన్నాయుడు | భీమవరం MLA చేతుల మీదుగా ఎలక్ట్రికల్ వాహనాల బ్రోచర్ | ఏపీలో 56 బీసీ కార్పొరేషన్లు..భీమవరంలో సంబరాలు | అమ్మ..అరగుండు..నాగార్జున వికృత చేష్ట..బిగ్ బాస్ లో | హైదరాబాద్ ను వదలని వర్షం..మరల మూసి ఉగ్రరూపం |

భీమవరం..ఇంజినీరింగ్ విద్యార్థిని హత్య కేసులో ట్విస్ట్

Updated: October 16, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్:  తెలుగు రాష్ట్రాలలో సంచలనం కలిగించిన  పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ఓ ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని దివ్య తేజస్విని విజయవాడలో నిన్న హత్యకు గురయిన  కేసులో  పోలీసు దర్యాప్తులో  కొత్త వాదనలు వినిపిస్తున్నాయి. క్రీస్తురాజపురం కొండ ప్రాంతానికి చెందిన వంకాయలపాటి దివ్య తేజశ్విని(22) పై పెయింటర్, బుడిగి నాగేంద్రబాబు (25) నిన్న గురువారం కత్తితో దాడిచేసి హతమార్చిన సంగతి తెలిసిందే అయితే దివ్యను తాను చంపలేదని, మా ఇద్దరికీ వివాహమైంది. పెళ్లిని తమ పెద్దలు అంగీకరించడంలేదని ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుందామనుకున్నాం. ఎవరి గొంతు వాళ్లే కోసుకున్నాం. నేను స్పృహ తప్పి పడిపోయాను. ఇద్దరం ఆత్మహత్యాయత్నం చేశామని నిందితుడు నాగేంద్ర పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. కాగా, ..అవన్నీ అబద్ధాలని దివ్య తల్లిదండ్రులు తోసిపుచ్చారు.  తమ బిడ్డను కిరాతకంగా పొట్టనబెట్టుకున్న నాగేంద్రను కూడా చంపేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఇక దివ్యపై దాడి అనంతరం తానూ మెడ, మణికట్టు, పొట్ట భాగాల్లో పొడుచుకున్న నాగేంద్ర తీవ్ర గాయాలతో గుంటూరు ప్రభుత్వాసుపత్రి (జీజీహెచ్‌)లో చికిత్స పొందుతున్నాడు. 
 
 
 

Related Stories