తాజా వార్తలు   అప్పుడు బిసిలను ఈసడించిన బాబు ఇప్పడు ఉద్ధరిస్తాడట.. | భీమవరంకు పొంచి ఉన్న యనమదుర్రు వరద ముప్పు.. | అల్పపీడనం ..రేపు కోస్తా ఆంధ్రలోభారీ వర్షాలు | శుభవార్త.. దక్షిణ మధ్య రైల్వే..మరో 900 ప్రత్యేక రైళ్లు | శ్రీ గాయత్రీ దేవిగా శ్రీ మావుళ్ళమ్మవారు..భక్తుల రద్దీ | సీఎం కెసిఆర్ దత్తపుత్రిక నిశ్చితార్థం..ఒక స్ఫూర్తి గాధ | ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ అధ్యక్షుడిగా..అచ్చెన్నాయుడు | భీమవరం MLA చేతుల మీదుగా ఎలక్ట్రికల్ వాహనాల బ్రోచర్ | ఏపీలో 56 బీసీ కార్పొరేషన్లు..భీమవరంలో సంబరాలు | అమ్మ..అరగుండు..నాగార్జున వికృత చేష్ట..బిగ్ బాస్ లో |

పండుగలకు తెలుగు రాష్ట్రాల నుండి ప్రత్యేక రైళ్లు

Updated: October 16, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: దసరా, దీపావళి పండుగలకు మరిన్ని ప్రత్యేక రైళ్ల వేళలను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వాటిలో ఉభయ తెలుగు రాష్ట్రాల కు కేటాయించిన ముఖ్యమైన  ప్రత్యేక రైళ్లు వివరాలు..కాచిగూడ–మైసూరు: ఈ నెల 20 నుంచి నవంబర్‌ 29 వరకు డెయిలీ సర్వీసు. కాచిగూడలో రాత్రి 7.05కు బయలుదేరి మరుసటి ఉదయం 9.30కి మైసూరు చేరుకుంటుంది. (21 నుంచి) మైసూరులో సాయంత్రం 3.15కు బయలుదేరి మరుసటి సాయంత్రం 5.40కి కాచిగూడ చేరుతుంది. ఇది జడ్చర్ల, మహబూబ్‌నగర్, అనంతపురం, బెంగళూరు మీదుగా ప్రయాణిస్తుంది. హైదరాబాద్‌–జైపూర్‌: సోమ, బుధవారాల్లో అక్టోబర్‌ 21 నుంచి నవంబర్‌ 25 వరకు. హైదరాబాద్‌లో రాత్రి 8.35కు బయలుదేరుతుంది. జైపూర్‌–హైదరాబాద్‌: బుధ, శుక్రవారాల్లో ఈ నెల 23 నుంచి నవంబర్‌ 27 వరకు. ఈ ప్రత్యేక రైలు జైపూర్‌లో మధ్యాహ్నం 3.20కి బయలుదేరుతుంది. సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, ముద్ఖేడ్‌ మీదుగా ప్రయాణిస్తుంది.విశాఖపట్నం–హజ్రత్‌ నిజాముద్దీన్‌: ఈ నెల 23 నుంచి శుక్ర, సోమవారాల్లో విశాఖలో ఉదయం 8.20కి బయలుదేరుతుంది. వరంగల్, బల్లార్షా మీదుగా ప్రయాణిస్తుంది. నిజాముద్దీన్‌–విశాఖపట్నం: ఇది ఈ నెల 25 నుంచి నవంబర్‌ 29 వరకు ప్రతి బుధ, ఆదివారాల్లో ఢిల్లీలో ఉదయం 5.50కి బయలుదేరుతుంది. బల్లార్షా, వరంగల్‌ మీదుగా ప్రయాణిస్తుంది.
 
 
 

Related Stories