తాజా వార్తలు   భీమవరంకు పొంచి ఉన్న యనమదుర్రు వరద ముప్పు.. | అల్పపీడనం ..రేపు కోస్తా ఆంధ్రలోభారీ వర్షాలు | శుభవార్త.. దక్షిణ మధ్య రైల్వే..మరో 900 ప్రత్యేక రైళ్లు | శ్రీ గాయత్రీ దేవిగా శ్రీ మావుళ్ళమ్మవారు..భక్తుల రద్దీ | సీఎం కెసిఆర్ దత్తపుత్రిక నిశ్చితార్థం..ఒక స్ఫూర్తి గాధ | ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ అధ్యక్షుడిగా..అచ్చెన్నాయుడు | భీమవరం MLA చేతుల మీదుగా ఎలక్ట్రికల్ వాహనాల బ్రోచర్ | ఏపీలో 56 బీసీ కార్పొరేషన్లు..భీమవరంలో సంబరాలు | అమ్మ..అరగుండు..నాగార్జున వికృత చేష్ట..బిగ్ బాస్ లో | హైదరాబాద్ ను వదలని వర్షం..మరల మూసి ఉగ్రరూపం |

బాలు విషయంలో నేషనల్ మీడియా తీరు బాధాకరం..

Updated: September 29, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: దక్షిణాది బాషలలోనే కాదు హిందీలోనూ తిరుగులేని సూపర్ హిట్స్ పాటలు పాడిన తెలుగు గాయకుడూ ఎస్పీ బాలు విషయంలో జాతీయ మీడియా వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు ఎదురౌతున్నాయి. దీనిపై  దర్శకుడు హరీష్‌ శంకర్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. భారతీయ లెజండ్.. ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణవార్తకు జాతీయ మీడియా సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవటంపై ఆయన ఆక్రోశం వ్యక్తం చేసారు. నేడు, శనివారం ట్విటర్‌ వేదికగా హరీష్‌ స్పందిస్తూ..‘‘ఇంటర్నేషనల్ మీడియా కూడా ఎంత అద్భుతంగా ప్రెజెంట్ చేసిందో..మన నేషనల్ మీడియాని చూస్తే జాలేస్తుంది. అంతేలే, కొందరి స్థాయి విశ్వవ్యాప్తం.. ఇరుకు సందుల్లో కాదు’’ అని పేర్కొన్నారు. ప్రముఖ ఇంటర్‌ నేషనల్‌‌ న్యూస్‌ ఛానల్‌ బీబీసీ.. ఎస్పీ బాలు మరణంపై ప్రచురించిన వార్తా కథనానికి సంబంధించిన వీడియోను తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు.  హీరో అర్జున్ అయితే బాలుకు" భారత రత్న" ఇవ్వవలసిందే నని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.

 
 

Related Stories