తాజా వార్తలు   భీమవరంకు పొంచి ఉన్న యనమదుర్రు వరద ముప్పు.. | అల్పపీడనం ..రేపు కోస్తా ఆంధ్రలోభారీ వర్షాలు | శుభవార్త.. దక్షిణ మధ్య రైల్వే..మరో 900 ప్రత్యేక రైళ్లు | శ్రీ గాయత్రీ దేవిగా శ్రీ మావుళ్ళమ్మవారు..భక్తుల రద్దీ | సీఎం కెసిఆర్ దత్తపుత్రిక నిశ్చితార్థం..ఒక స్ఫూర్తి గాధ | ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ అధ్యక్షుడిగా..అచ్చెన్నాయుడు | భీమవరం MLA చేతుల మీదుగా ఎలక్ట్రికల్ వాహనాల బ్రోచర్ | ఏపీలో 56 బీసీ కార్పొరేషన్లు..భీమవరంలో సంబరాలు | అమ్మ..అరగుండు..నాగార్జున వికృత చేష్ట..బిగ్ బాస్ లో | హైదరాబాద్ ను వదలని వర్షం..మరల మూసి ఉగ్రరూపం |

ప‌వ‌న్‌క‌ల్యాణ్ PSPK 27 సినిమా ప్రీ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

Updated: September 4, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ 27వ సినిమా అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మైంది. క‌రోనా రావ‌డంతో షూటింగ్ ఆగింది. ప‌వ‌న్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా ప్రీ లుక్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. మెగా సూర్య ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎ.ఎం.ర‌త్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉంగ‌రాలు, చేతికి క‌డియం, గ‌రుత్మంతుడు బొమ్మ...తో ప్రీ లుక్ తో సాహసవీరుడి  పీరియాడిక్ చిత్రంలా అనిపిస్తుంది. ‘‘పవన్‌క‌ల్యాణ్‌గారు మీ 27వ చిత్రం 15 రోజుల  షూటింగ్ ప్రతిక్షణం టీం అందరికీ గొప్ప జ్ఞాపకంలా కదులుతుంది. చిరస్థాయిగా నిలిచే విజయం కంటికి కనిపిస్తుంది. ఇందుకు కారణం మీరు, మీ ప్రోత్సాహం, మీ సహృదయం..ఎప్పటికీ ఇలాగే కోట్లాది జనం శుభాకాంక్షలు  అందుకుంటుండాలని ఆశిస్తూ.. హ్యాపీ బ‌ర్త్ డే ప‌వ‌న్‌క‌ల్యాణ్‌’’ అని క్రిష్ ట్వీట్ చేశారు. ఎం.ఎం.కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 
 
 
 

Related Stories