తాజా వార్తలు   భీమవరంకు పొంచి ఉన్న యనమదుర్రు వరద ముప్పు.. | అల్పపీడనం ..రేపు కోస్తా ఆంధ్రలోభారీ వర్షాలు | శుభవార్త.. దక్షిణ మధ్య రైల్వే..మరో 900 ప్రత్యేక రైళ్లు | శ్రీ గాయత్రీ దేవిగా శ్రీ మావుళ్ళమ్మవారు..భక్తుల రద్దీ | సీఎం కెసిఆర్ దత్తపుత్రిక నిశ్చితార్థం..ఒక స్ఫూర్తి గాధ | ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ అధ్యక్షుడిగా..అచ్చెన్నాయుడు | భీమవరం MLA చేతుల మీదుగా ఎలక్ట్రికల్ వాహనాల బ్రోచర్ | ఏపీలో 56 బీసీ కార్పొరేషన్లు..భీమవరంలో సంబరాలు | అమ్మ..అరగుండు..నాగార్జున వికృత చేష్ట..బిగ్ బాస్ లో | హైదరాబాద్ ను వదలని వర్షం..మరల మూసి ఉగ్రరూపం |

అమెరికాలో2 లక్షల కరోనా మరణాలు..ఉచితంగా వాక్సిన్..

Updated: September 18, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: ఒక్క ప్రక్క అమెరికా అడ్జక్ష  ఎన్నికలకు రంగం సిద్ధం అవుతుండగా  కరోనా వైరస్‌ను ట్రంప్ ప్రభుత్వం  సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయిందని  అనేకమంది అమెరికన్‌ పౌరులు ప్రాణాలు కోల్పోయారనే  ప్రతి పక్షాలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటి వరకు అమెరికాలో 68,25,448 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 2,01,266 మంది కరోనాతో మరణించారు. దీనితో  ట్రంప్‌ నిర్లక్ష్యం వల్లే అనేకమంది అమెరికన్‌ పౌరులు ప్రాణాలు కోల్పోయారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. దీంతో ట్రంప్‌ సర్కార్‌ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.వచ్చే ఏడాది జనవరి నాటికి దేశంలోని పౌరులందరికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా హెల్త్‌ అండ్‌ హూమన్‌ సర్వీసెస్‌, యూఎస్‌ డిఫెన్స్‌ శాఖలు సంయుక్తంగా రెండు డాక్యుమెంట్లను విడుదల‌ చేశాయి. 

 
 

Related Stories