తాజా వార్తలు   వారిని,వీరిని రెచ్చగొడుతూ..బాబు సినిమాలు..కొడాలి ఘాటు | FLASH..భారత్ లో కరోనా వైరస్ సత్తా మరో 2 వారాలలో.. | ఏపీ లో స్కూళ్ళు తెరవడం.. మరోసారి వాయిదా | దీపికా కిడ్నప్ కధ సుఖంతం..దిమ్మతిరిగే ట్విస్ట్ | భారత్ లోనే ఎక్కువ పన్ను చెల్లించిన ట్రాంప్ | ఏపీ హైకోర్టులో పిటిషన్లు వేసిన కృష్ణంరాజు, అశ్వనీదత్ | ఎన్డీయే నుంచి రెండు సింహాలు వచ్చేసాయి..శివసేన ఘాటు | బాలు కు భారత రత్న ఇవ్వండి..సీఎం జగన్ ప్రధానికి విజ్ఞప్తి | వచ్చే నెల 16 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు | సామాన్యుడు ఎలా బ్రతకాలి? కూరగాయలు ధరలు కూడా.. |

ఇక సినిమాహాళ్ళకు ప్రేక్షకులు వస్తారా? ..అల్లు అరవింద్

Updated: August 14, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: లాక్ డౌన్ తో దేశ వ్యాప్తంగా సినిమా హాళ్లు మూతపడి దాదాపు 6 నెలలు కావస్తుంది. సినిమా హాళ్లు మరో 2 నెలలు తెరిచే అవకాశం కనపడటంలేదు. దీనిపై ప్రముఖ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ నేపధ్యంలో ఓటీటీల వినియోగం గణనీయంగా పెరిగిందని, సినిమా హాళ్లు తిరిగి ప్రారంభించినా, ప్రజలు సినిమాలు చూసేందుకు వచ్చే పరిస్థితి లేదని తేల్చిపారేశారు.ఇకపై  కేవలం వారాంతాల్లో మాత్రమే ప్రజలు థియేటర్లకు వస్తారని, మిగతా రోజుల్లో ఓటీటీలు, టీవీ చానెళ్లనే వీక్షించవచ్చని ఆయన అబిప్రాయపడ్డారు. తమ ఆహా యాప్ నకు మంచి స్పందన లభిస్తోందని, ఇప్పటికే 40 లక్షలకు పైగా డౌన్ లోడ్లు వచ్చాయని ఆయన తెలిపారు. ప్రేక్షకుల కోసం కొత్త సినిమాలు, స్పెషల్ షోలను విడుదల చేయనున్నామని అన్నారు. సినీ ప్రేక్షకులకు  సినిమా హాళ్లు తెరచుకున్నా, ఓటీటీని పక్కన పెడతారని భావించడం లేదని అన్నారు. మూవీ థియేటర్లు, ఓటీటీలు సమాంతరంగా సాగుతాయని భరోసా ఇచ్చారు. 

 
 

Related Stories