తాజా వార్తలు   భీమవరంకు పొంచి ఉన్న యనమదుర్రు వరద ముప్పు.. | అల్పపీడనం ..రేపు కోస్తా ఆంధ్రలోభారీ వర్షాలు | శుభవార్త.. దక్షిణ మధ్య రైల్వే..మరో 900 ప్రత్యేక రైళ్లు | శ్రీ గాయత్రీ దేవిగా శ్రీ మావుళ్ళమ్మవారు..భక్తుల రద్దీ | సీఎం కెసిఆర్ దత్తపుత్రిక నిశ్చితార్థం..ఒక స్ఫూర్తి గాధ | ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ అధ్యక్షుడిగా..అచ్చెన్నాయుడు | భీమవరం MLA చేతుల మీదుగా ఎలక్ట్రికల్ వాహనాల బ్రోచర్ | ఏపీలో 56 బీసీ కార్పొరేషన్లు..భీమవరంలో సంబరాలు | అమ్మ..అరగుండు..నాగార్జున వికృత చేష్ట..బిగ్ బాస్ లో | హైదరాబాద్ ను వదలని వర్షం..మరల మూసి ఉగ్రరూపం |

ఒక్క ముద్దుతో 3 గంటలలో పెళ్లి పెటాకులు..పెద్ద ట్విస్ట్

Updated: August 30, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్; సినిమాలలో కూడా ఇటువంటి ట్విస్ట్ జరగలేదు..తాజా వార్త కధనం ప్రకారం.. కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌ పట్టణంలో హుజూరాబాద్‌కు చెందిన దివ్య కు గత  సోమవారం రాత్రి పెళ్లి జరిపించారు.అప్పగింతలు జరిగి ఊరేగింపు మొదలైన సమయంలో, పెళ్లి కుమార్తె  దివ్య ప్రేమించిన  ప్రియుడు వంశీ పూర్తీ మద్యం మత్తులో  సీన్‌లోకి వచ్చి నానా హంగామా సృష్టించాడు. నవ దంపతులు పెళ్లికూతురు ఇంటి నుంచి ఊరేగింపుగా బయలుదేరుతుండగా కారును అడ్డుకున్నాడు. పెళ్లికూతురిని కిందకి దింపి, ఎవరు ఊహించని రీతిలో  వరుడి ఎదుటే ఆమెకు ముద్దుపెట్టాడు. ఇంకేముంది ఈ ఘటన చూసిన పెళ్ళికొడుకు బిత్తరపోయాడుదీంతో పెళ్లింట ఆందోళన నెలకొంది. సీన్ పెళ్లి ఇంటి నుంచి పోలీస్ స్టేషన్‌కు మారింది. మద్యం మత్తులో వంశీ అనే యువకుడు తనపై దాడికి యత్నించాడని వరుడు ప్రవీణ్‌కుమార్‌ ఫిర్యాదు చేశాడు. దీంతో వంశీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు న్యూసెన్స్ కేసు నమోదు చేశారు. అయితే పెళ్లికూతురు  తనకు పెళ్ళికొడుకు వద్దని ప్రియుడే కావాలని, అతనితోనే కలిసి ఉంటానని మరో ఫిర్యాదు చేసింది. దీంతో వధువును అక్కడే వదిలేసి వరుడు మందమర్రి వెళ్లిపోయాడు. మరోవైపు, తల్లిదండ్రులు కూడా కుమార్తెను పోలీస్ స్టేషన్‌లోనే వదిలిపెట్టి వెళ్లిపోయారు. పోలీస్ స్టేషన్‌లో ఒంటరిగా మిగిలిన వధువును పోలీసులు కరీంనగర్‌లోని స్వధార్ హోంకు తరలించారు. 

 
 

Related Stories