తాజా వార్తలు   ఆంధ్ర ప్రదేశ్ లో 3 రోజుల పాటు వర్ష సూచన | మలమూత్ర విసర్జన రహిత పట్టణంగా భీమవరం..స్వచ్ఛ | ఆంధ్ర ప్రదేశ్ కు కేంద్రం ఇచ్చిందేమిటి? కేటీఆర్ సూటి ప్రశ్న | రాజమండ్రిలో ఒకే కుటుంబంలో 4 ఆత్మహత్యలు | ఆ ‌హీరో తో 10 సినిమాలు చేస్తాను..అనిల్ రావిపూడి | తిరిగి బీజేపీ లో చేరిపోయిన రాములమ్మ... | కరోనా కేసులు పెరుగుతుంటే ఏమి చేస్తున్నారు?..సుప్రీం | అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ ను గుర్తించం.. రష్యా | ‌హైదరాబాద్ బ్రాండ్ ఏ ప్రభుత్వానికి చెందదు..కేటీఆర్ | ఆంధ్ర ప్రదేశ్లో ఈ 23 నుంచి క్రింది తరగతులు.. |

బావిలో 7గురు వలస కూలీలా మృతదేహాలు..ఎంతదారుణం ?

Updated: May 22, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: తెలంగాణాలో  వలస కూలీలా కుటుంబం దారుణ విషాదం దేశ వ్యాప్తంగా నిన్న మొదలయి నేడు, శుక్రవారం కూడా ఊహించని ట్విస్టులతో సంచలనం రేపుతోంది. గీసుకొండ మండటం గొర్రెకుంటలోని బావిలో శుక్రవారం మరో 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో మొత్తం మృతుల సంఖ్య 7కు చేరుకుంది. నిన్న బావిలో 4 మృతదేహాలు లభ్యమైన విషయం తెలిసిందే. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు.  తమను పోషించుకోవడం కోసం ఎక్కడో పశ్చిమ బెంగాల్‌ నుంచి వలస వచ్చిన కుటుంబం.. ఇరవై ఏళ్లుగా వరంగల్‌ కరీమాబాద్‌లో నివాసముంటూ చినిగిన బస్తా సంచులు(బార్‌దాన్‌) కుడుతూ పొట్ట పోసుకుంటున్నారు. దంపతులతో పాటు కుమార్తె, ఇద్దరు కుమారులు కలిసే ఉండేవారు.లాక్‌డౌన్‌ నేపథ్యంలో పనిచేసే చోటకు మకాం మార్చిన ఆ కుటుంబంలోని నలుగురు బావిలో నిన్న  గురువారం మృతదేహాలుగా తేలారు. కుటుంబ పెద్ద అయిన తండ్రితో పాటు ఆయన భార్య, కుమార్తె, మనవడు విగత జీవులుగా కనిపించడంతో ఎవరైనా హత్య చేశారా?.. వారే ఆకలి బాధలకు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డారా? ..అయితే నేడు,  శుక్రవారం మరో మూడు మృతదేహాలు బయటపడ్డాయి. మృతులు మసూద్‌, నిషా, బుషారాకతూన్‌, బేబీ, షకీల్‌, షాబాజ్‌ అలం, సోహైల్ అలంగా గుర్తించారు. బావిలో నీటిని అధికారులు బయటకు తీస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఘటన మనసున్న ప్రతి మనిషిని కదిలిస్తుంది.. మానవత్వాన్ని  ప్రశ్నిస్తుంది.. 
 
 

Related Stories