తాజా వార్తలు   కనుమ...గోపూజ మహోత్సవంలో సీఎం జగన్‌ | ఆంధ్ర ప్రదేశ్ లో332 ప్రాంతాలలోకరోనా వాక్సిన్లు వేస్తారు.. | వ్యానును టిప్పర్‌ లారీ ఢీ.. 11మంది మృతి | దేశంలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ రేపటినుండి ప్రారంభం | బుక్ చేసుకొన్నా గంటలో వంట గ్యాస్ సిలండర్ | శ్రీ ఆదిలక్ష్మి దేవి అవతారంలో శ్రీ మావుళ్ళమ్మ.. | గోదావరి జిల్లాలలో పందెపు కోడి కాలు దువ్వింది.. | శ్రీ మావుళ్ళమ్మ ఉత్సవాలు ప్రారంభం..హుండీ ఆదాయం | సంక్రాంతి శుభాకాంక్షలు..భీమవరం MLA గ్రంధి శ్రీనివాస్ | నా సర్వీసులో ఇటువంటి కుట్రలు చూడలేదు..డీజీపీ సవాంగ్ |

ఏపీలో కరోనా సోకిన వారి సంఖ్యా 2500 దాటింది.. అయితే

Updated: May 22, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో లాక్ డౌన్ సడలింపులతో జనజీవితం గాడిన పడుతుంది. అయితే మరో ప్రక్క కరోనా టెస్టులు కూడా పకడ్బందీగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో  నేడు, శుక్రవారం కొత్తగా 62 మందికి కరోనా  పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు  వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2514కు చేరింది. గడిచిన 24 గంటల్లో 8,415 మంది సాంపిల్స్‌ పరీక్షించగా 62 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్థారణయింది. కాగా శుక్రవారం కొత్తగా 51 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 1731కి చేరింది. కరోనాతో ఇవాళ కృష్ణా నుంచి ఒకరు మరణించడంతో మృతుల సంఖ్య 55కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 728 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

 
 

Related Stories