తాజా వార్తలు   ఆటో,ట్యాక్సీ లబ్దిదారులకు 2వ సారి 10 వేల.రూ చప్పున.. సీఎం | శుభవార్త.. 8 నుంచి ఏపీ లో హోటల్స్ తెరవడానికి పచ్చజెండా.. | ఇకపై భీమవరం మార్కెట్ రాత్రి 7 గంటల వరకు..MLA గ్రంధి.. | ట్రాంప్ సంచలనమ్ ..అమెరికాకు చైనా విమానాలు నిషేధం | తెలంగాణాలో3000 దాటిన కరోనా కేసులు..హైదరాబాద్ లో 2,105.. | తెలంగాణలో కొత్తగా 87కరోనా కేసులు..1,273 చికిత్స పొందుతున్నారు | ఏపీలో కొత్తగా 79 కరోనా కేసులు..967 మంది కి చికిత్స | ఏపీలో సచివాలయాలు రంగులు మార్చండి .సుప్రీం తీర్పు | దేశంలోఒక్క రోజులోసుమారు 9వేల కరోనా కేసులు..ఆ 2రాష్ట్రాలలో.. | దేశంలో ప్రజా ఆదరణతో టాప్ 4 సీఎం జగన్ .. |

తెలంగాణలో కరోనా టెస్టులపై ఇంత నిర్లక్ష్యమా? కేంద్రం ఆగ్రహం

Updated: May 21, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: తెలంగాణలో కరోనా పరీక్షల నిర్వహణ బాగోలేదంటూ  కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశంలో అన్ని రాష్ట్రాలు పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తుంటే.. తెలంగాణలో కేవలం 21వేల టెస్టులు మాత్రమే జరిగాయని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనాపై ఇంతే నిర్లక్ష్యంగా ఉంటే భవిష్యత్‌లో తీవ్ర నష్టం జరుగుతుందని  హెచ్చరించింది. ఈ మేరకు నేడు, గురువారం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌కు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లేఖ రాశారు. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయాలంటే ఐసీఎంఆర్‌ నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం సూచించింది.దేశ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో చాలా తక్కవ పరీక్షలు నిర్వహిస్తున్నారని మండిపడింది. ఇక కేంద్ర ఆరోగ్యశాఖ రాసిన లేఖపై రాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రి ఈటల రాజేందర్‌ స్పందించారు. రాష్ట్రంలోని పరిస్థితులకు అనుగుణంగా కరోనా పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. అలాగే ఐసీఎంఆర్ నిబంధల ప్రకారమే కరోనా పరీక్షలు జరుగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. పరీక్షలపై ప్రజలెవరూ ఆందోళన చెందటం లేదని వివరించారు. కాగా కేంద్రం ఇటీవల ప్రకటించిన  ప్యాకేజీపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బహిరంగంగానే అది ఒట్టి  బోగస్ ప్యాకేజీ అని  ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం దేశం అంత చూసింది మరి.. 

 
 

Related Stories