తాజా వార్తలు   ఆటో,ట్యాక్సీ లబ్దిదారులకు 2వ సారి 10 వేల.రూ చప్పున.. సీఎం | శుభవార్త.. 8 నుంచి ఏపీ లో హోటల్స్ తెరవడానికి పచ్చజెండా.. | ఇకపై భీమవరం మార్కెట్ రాత్రి 7 గంటల వరకు..MLA గ్రంధి.. | ట్రాంప్ సంచలనమ్ ..అమెరికాకు చైనా విమానాలు నిషేధం | తెలంగాణాలో3000 దాటిన కరోనా కేసులు..హైదరాబాద్ లో 2,105.. | తెలంగాణలో కొత్తగా 87కరోనా కేసులు..1,273 చికిత్స పొందుతున్నారు | ఏపీలో కొత్తగా 79 కరోనా కేసులు..967 మంది కి చికిత్స | ఏపీలో సచివాలయాలు రంగులు మార్చండి .సుప్రీం తీర్పు | దేశంలోఒక్క రోజులోసుమారు 9వేల కరోనా కేసులు..ఆ 2రాష్ట్రాలలో.. | దేశంలో ప్రజా ఆదరణతో టాప్ 4 సీఎం జగన్ .. |

AP లో కొత్తగా 45 మందికి..పశ్చిమలో ఏకంగా 17 కేసులు..

Updated: May 21, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో  నేడు, గురువారం కొత్తగా 45 మందికి కరోనా  పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు  వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2452 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 8,092 మంది సాంపిల్స్‌ పరీక్షించగా 45 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్థారణయింది. కాగా కొత్తగా 41 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 1680కి చేరింది. కరోనాతో ఇవాళ  నెల్లూరు నుంచి ఒకరు మరణించడంతో మృతుల సంఖ్య 54కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 718 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అయితే, పశ్చిమ గోదావరి జిల్లాలో రికార్డ్ స్థాయిలో  నేడు, గురువారం 17 కేసులు నమోదు అయ్యాయి. వాటిలో దెందులూరు నియోజకవర్గంలో 11 కేసులు, పెనుగొండలో 3, సిద్దాంతంలో ఒకటి , తోటగూడెంలో 2 కేసులు నమోదు కావడం ఆందోళన రేకెత్తించింది. ఈ కొత్త కేసులతో జిల్లాలో మొత్తం కేసుల 91 కి చేరుకొంది. 

 
 

Related Stories