తాజా వార్తలు   దేశంలో పలు రాష్ట్రాలలో భూప్రకంపనలు.. | కరోనా కేసులలో భారత్ వేగం ఎంత ఆందోళనకరమంటే.. | ఆటో,ట్యాక్సీ లబ్దిదారులకు 2వ సారి 10 వేల.రూ చప్పున.. సీఎం | శుభవార్త.. 8 నుంచి ఏపీ లో హోటల్స్ తెరవడానికి పచ్చజెండా.. | ఇకపై భీమవరం మార్కెట్ రాత్రి 7 గంటల వరకు..MLA గ్రంధి.. | ట్రాంప్ సంచలనమ్ ..అమెరికాకు చైనా విమానాలు నిషేధం | తెలంగాణాలో3000 దాటిన కరోనా కేసులు..హైదరాబాద్ లో 2,105.. | తెలంగాణలో కొత్తగా 87కరోనా కేసులు..1,273 చికిత్స పొందుతున్నారు | ఏపీలో కొత్తగా 79 కరోనా కేసులు..967 మంది కి చికిత్స | ఏపీలో సచివాలయాలు రంగులు మార్చండి .సుప్రీం తీర్పు |

తాడేపల్లి గూడెంలో జనసేన నేత ఆత్మహత్యాయత్నం..

Updated: May 21, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జనసేన నేత .లోకేష్ నాయుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. స్థానిక ఎమ్మెల్యే  కొట్టు సత్యనారాయణ తనను వేధిస్తున్నారనే కారణంతో నిన్న రాత్రి పోలీసు స్టేషన్‌లో పురుగు మందు తాగి లోకేష్ నాయుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు అని జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. పోలీసులు అతడిని తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. అయితే అతడికి చికిత్స అందిస్తున్న ఆసుపత్రి  రెడ్ జోన్ పరిధిలో ఉండడంతో, అతడిని వేరే ప్రాంతపు  ప్రవేటు ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు యత్నిస్తుండగా.. దానికి అధికారులు అంగీకరించడం లేదు అని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై పోలీస్ వర్గాలనుండి ఇంకా పూర్తీ  వాస్తవవివరణ రావాల్సి ఉంది. 

 
 

Related Stories