తాజా వార్తలు   కరోనా కేసులలో భారత్ వేగం ఎంత ఆందోళనకరమంటే.. | ఆటో,ట్యాక్సీ లబ్దిదారులకు 2వ సారి 10 వేల.రూ చప్పున.. సీఎం | శుభవార్త.. 8 నుంచి ఏపీ లో హోటల్స్ తెరవడానికి పచ్చజెండా.. | ఇకపై భీమవరం మార్కెట్ రాత్రి 7 గంటల వరకు..MLA గ్రంధి.. | ట్రాంప్ సంచలనమ్ ..అమెరికాకు చైనా విమానాలు నిషేధం | తెలంగాణాలో3000 దాటిన కరోనా కేసులు..హైదరాబాద్ లో 2,105.. | తెలంగాణలో కొత్తగా 87కరోనా కేసులు..1,273 చికిత్స పొందుతున్నారు | ఏపీలో కొత్తగా 79 కరోనా కేసులు..967 మంది కి చికిత్స | ఏపీలో సచివాలయాలు రంగులు మార్చండి .సుప్రీం తీర్పు | దేశంలోఒక్క రోజులోసుమారు 9వేల కరోనా కేసులు..ఆ 2రాష్ట్రాలలో.. |

దేశంలో కరోనా కేసులు ఆల్ టైం రికార్డు.. ఒక్కరోజులోనే..

Updated: May 21, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: భారత దేశంలో  కరోనా పాజిటివ్  కేసుల సంఖ్య అంతకంతకు  పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో  5,611 కరోనా కేసులు నమోదయయ్యాయి. దేశంలో ఒక్క రోజు వ్యవధిలో ఇంత పెద్ద మొత్తంలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,06,750కి చేరింది. అయితే  ఇప్పటివరకు 42,297 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 3,303 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 61,149 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 37,136 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో 9,639 కరోనా నుంచి కోలుకోగా, 1,325 మంది మృతిచెందారు. ఆ తర్వాత   తమిళనాడులో 12,448, గుజరాత్‌లో 12,140, ఢిల్లీలో 10,554 కరోనా కేసులు నమోదయ్యాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలలో మాత్రం పరిస్థితి అదుపులో ఉంది. ఇక్కడ నమోదయిన మొత్తం 3వంతు కేసులలో దాదాపుగా 2వంతు కేసులు కోలుకొని డిశ్చార్జ్ కావడం శుభ పరిణామం.. 

 
 

Related Stories