తాజా వార్తలు   ఆటో,ట్యాక్సీ లబ్దిదారులకు 2వ సారి 10 వేల.రూ చప్పున.. సీఎం | శుభవార్త.. 8 నుంచి ఏపీ లో హోటల్స్ తెరవడానికి పచ్చజెండా.. | ఇకపై భీమవరం మార్కెట్ రాత్రి 7 గంటల వరకు..MLA గ్రంధి.. | ట్రాంప్ సంచలనమ్ ..అమెరికాకు చైనా విమానాలు నిషేధం | తెలంగాణాలో3000 దాటిన కరోనా కేసులు..హైదరాబాద్ లో 2,105.. | తెలంగాణలో కొత్తగా 87కరోనా కేసులు..1,273 చికిత్స పొందుతున్నారు | ఏపీలో కొత్తగా 79 కరోనా కేసులు..967 మంది కి చికిత్స | ఏపీలో సచివాలయాలు రంగులు మార్చండి .సుప్రీం తీర్పు | దేశంలోఒక్క రోజులోసుమారు 9వేల కరోనా కేసులు..ఆ 2రాష్ట్రాలలో.. | దేశంలో ప్రజా ఆదరణతో టాప్ 4 సీఎం జగన్ .. |

లాక్ డౌన్ 4.0 ప్రారంభం..సడలింపులు..నిబంధనలు ఏమిటంటే..

Updated: May 19, 2020

 

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: మనదేశం లో ప్రజలందరూ ఊహించినట్లే.. రేపటి నుండి 4వ విడత  లాక్ డౌన్ 4. 0 ప్రారంభిస్తున్నట్లు కేంద్రం నేడు, ఆదివారం సాయంత్రం  ప్రకటించింది.  కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ను మే 31 వరకూ పొడిగిస్తూ తాజా లాక్‌డౌన్‌ మార్గదర్శకాలను జారీ చేసింది. వీటిలో ముఖ్యంగా విమాన, మెట్రో సర్వీసులకు అనుమతి లేదని, హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్‌ను,విద్యాసంస్ధల ను అనుమతించబోమని స్పష్టం చేసింది. కరోనా కేసులు బయటపడిన  కంటైన్మెంట్‌ జోన్లలో అత్యవసర సేవలకే అనుమతిస్తామని పేర్కొంది. అలాగే కరోనా కట్టడికి అన్ని రాష్ట్రాలు కఠినంగా ఉండాలని, పాజిటివ్‌ కేసుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించే రాష్ట్రాలపై కూడా కఠినంగా వ్యవహరిస్తామని  కేంద్రం సంకేతాలు ఇచ్చింది. అయితే ఈ సారి  లాక్ డౌన్ ఇచ్చిన సడలింపులు విషయానికి వస్తే.. రాష్ట్రాల అనుమతులతో లోకల్ గా బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణాలకు అనుమతి ఇచ్చారు. రాష్ట్ర పరిధిలో బస్సు సర్వీసులు, ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణాలపై రాష్ట్రాలదే తుది నిర్ణయం..రాత్రి 7గంటల నుంచి ఉదయం 7గంటల వరకు కర్వ్యూ నిబంధనలు అమలు చేస్తారు. మిగతా సమయాలలో నిబంధనల మేరకు వ్యాపారాలు, ముఖ్యమైన పనులు చేసుకోవచ్చును. అయితే 65 ఏళ్లు దాటినవారు, గర్భిణి మహిళలు, 10 ఏళ్ల లోపు చిన్నారులు ఇళ్లకే పరిమితం ఇకపై రెడ్‌, గ్రీన్, ఆరెంజ్‌ జోన్‌ల గుర్తింపు అధికారం  జిల్లా అధికారులకె ఇచ్చారు. 
 
 
 

Related Stories