తాజా వార్తలు   కరోనా కేసులలో భారత్ వేగం ఎంత ఆందోళనకరమంటే.. | ఆటో,ట్యాక్సీ లబ్దిదారులకు 2వ సారి 10 వేల.రూ చప్పున.. సీఎం | శుభవార్త.. 8 నుంచి ఏపీ లో హోటల్స్ తెరవడానికి పచ్చజెండా.. | ఇకపై భీమవరం మార్కెట్ రాత్రి 7 గంటల వరకు..MLA గ్రంధి.. | ట్రాంప్ సంచలనమ్ ..అమెరికాకు చైనా విమానాలు నిషేధం | తెలంగాణాలో3000 దాటిన కరోనా కేసులు..హైదరాబాద్ లో 2,105.. | తెలంగాణలో కొత్తగా 87కరోనా కేసులు..1,273 చికిత్స పొందుతున్నారు | ఏపీలో కొత్తగా 79 కరోనా కేసులు..967 మంది కి చికిత్స | ఏపీలో సచివాలయాలు రంగులు మార్చండి .సుప్రీం తీర్పు | దేశంలోఒక్క రోజులోసుమారు 9వేల కరోనా కేసులు..ఆ 2రాష్ట్రాలలో.. |

20 కోట్ల మంది మహిళలకు 8..కోట్ల రైతులకు నగదు బదిలీ,.నిర్మల

Updated: May 19, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్:  కరోనా కట్టడి నేపథ్యంలో భారీగా  నష్టపోయిన భారత ఆర్ధిక వ్యవ్యస్థను గట్టెక్కించడానికి ప్రధాని నరేంద్ర మోదీ స్వయం సమృద్ధి భారత్  పేరిట రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి అఖరి విడత ప్యాకేజీ వివరాలను నేడు,  ఆదివారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. పీఎం కిసాన్‌ పథకం ద్వారా 8.19 కోట్ల మందికి రూ. 2వేల చొప్పున ఇచ్చామని వెల్లడించారు. జన్‌ధన్‌ ఖాతాల ద్వారా 20 కోట్ల మంది మహిళలకు నగదు బదిలీ చేశామన్నారు. నిర్మాణ రంగంలో పనిచేసే 2.20 కోట్ల మంది కూలీలకు ఆర్థిక సహాయం అందించామని.. భవన నిర్మాణ కార్మికుల ఖాతాల్లో రూ. 3,995 కోట్లు జమచేశామని ,ఉజ్వల యోజన ద్వారా 6.81 కోట్ల ఫ్రీ సిలిండర్లు సరఫరా చేశామని మంత్రి తెలిపారుదేశంలో వైద్య సదుపాయాల ఏర్పాటుకు రూ. 15 వేల కోట్లు కేటాయించినట్టు చెప్పారు. వైద్య రంగంలో పనిచేసే సిబ్బంది రూ. 50 లక్షల బీమా సౌకర్యం అందిస్తున్నట్టు తెలిపారు. కోవిడ్‌ రిలీఫ్‌ ఫండ్‌ కింద రాష్ట్రాలకు రూ. 4,113 కోట్లు అందజేశామని తెలిపారు. ఇకపై అన్న  రాష్ట్రాలకు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి 3 నుంచి 5 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించారు. కోవిడ్‌ దృష్ట్యా రాష్ట్రాలు ఆదాయాన్ని కోల్పోతున్నాయని అందుకే రూ. 11,092 కోట్ల ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులను ఇప్పటికే అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. జీతభత్యాల చెల్లింపులో రాష్ట్రాలకు ఓవర్‌డ్రాఫ్ట్‌ తీసకునే అవకాశం కల్పించడంతో పాటుగా.. ఓవర్‌డ్రాఫ్ట్‌  తీసుకునే అవకాశాన్ని 52 రోజులకు పెంచినట్టు వెల్లడించారు. పన్ను ఆదాయం కింద రాష్ట్రాలకు రూ. 46 వేల కోట్ల కేటాయింపులు చేస్తున్నట్టు తెలిపారు. విద్యార్థుల కోసం  ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ను ప్రోత్సహించడంలో భాగంగా వన్‌ క్లాస్‌, వన్‌ డిజిటిల్‌ పేరుతో డిజిటల్‌ పాఠాలు. త్వరలోనే టీవీ, రేడియోల ద్వారా ఆన్‌లైన్‌ పాఠాలు నిర్వహిస్తామన్నారు. 
 
 
 
 

Related Stories