తాజా వార్తలు   కరోనా కేసులలో భారత్ వేగం ఎంత ఆందోళనకరమంటే.. | ఆటో,ట్యాక్సీ లబ్దిదారులకు 2వ సారి 10 వేల.రూ చప్పున.. సీఎం | శుభవార్త.. 8 నుంచి ఏపీ లో హోటల్స్ తెరవడానికి పచ్చజెండా.. | ఇకపై భీమవరం మార్కెట్ రాత్రి 7 గంటల వరకు..MLA గ్రంధి.. | ట్రాంప్ సంచలనమ్ ..అమెరికాకు చైనా విమానాలు నిషేధం | తెలంగాణాలో3000 దాటిన కరోనా కేసులు..హైదరాబాద్ లో 2,105.. | తెలంగాణలో కొత్తగా 87కరోనా కేసులు..1,273 చికిత్స పొందుతున్నారు | ఏపీలో కొత్తగా 79 కరోనా కేసులు..967 మంది కి చికిత్స | ఏపీలో సచివాలయాలు రంగులు మార్చండి .సుప్రీం తీర్పు | దేశంలోఒక్క రోజులోసుమారు 9వేల కరోనా కేసులు..ఆ 2రాష్ట్రాలలో.. |

భీమవరం ఆరెంజ్ జోన్ కి వచ్చాక ..మార్కెట్ పరిస్థితి ఏమిటంటే ?

Updated: May 19, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: భీమవరం పట్టణం తాజగా ఆరెంజ్ జోన్ పరిధిలోనికి రావడంతో దేశవ్యాప్తంగా అమలు లో ఉన్న  లాక్ డౌన్ నుండి  నిన్న శనివారం నుండి అనేక మినహాయింపులు పొందింది. పట్టణంలో ప్రజలు గతంలోలా తెల్లవారు జాము లేచి దూకుడుగా ఉదయం 9గంటల లోగ కొనుగోళ్లు ముగించుకొని ఇంటికి వెళ్లిపోవాల్సిన అవసరం లేకపోవడం .. సాయంత్రం 5 గంటల వరకు కావలసిన నిత్యావసర వస్తువులు కొనుగోలుకు అవకాశం ఉండటంతో ప్రశాంతంగా మాస్కులు కట్టుకొని షాపుల వద్ద గడబిడ  లేకుండా రద్దీ లేకుండా కొనుగోళ్లు చేసారు. నేడు, ఆదివారం కూడా చాల ప్రశాంతంగా రోడ్లపై ఉదయం 6గంటల నుండి చాల తక్కువ జనమే కనపడ్డారు. చేపల మార్కెట్ లో మేక, చికెన్ మాంసం అమ్మకాలు చాల ప్రశాంతంగా జరిగాయి.ధరలు మాత్రం అదిరిపోయాయి.చేపలు, రొయ్యలు అమ్మకాలు మాత్రం  చాల సరసమైన ధరలకు నిర్వహించారు. స్థానిక లూథరన్ హైస్కూల్ గ్రౌండ్ లో స్థానిక ఎంఎల్ఏ గ్రంధి శ్రీనివాస్ ఆదేశాలతో  ఆక్వా అమ్మకాలు నిర్వహించడంతో  నాన్ వెజ్ ప్రియులకు నిజంగా పండుగే అయ్యింది.1కేజీ చేప 100 రూపాయలకు రొయ్య 200 లోపే ధరకు లభించాయి.ఇక  పట్టణంలో 19, 26 వార్డులలో కొద్దీ ప్రాంతాలు ప్రజలు  మాత్రం ఇప్పటికి రెడ్ జోన్ పరిధిలో బయట పట్టణానికి  దూరంగా ఉన్నారు. స్థానిక మెంటే వారి తోట ప్రజలు సుదీర్ఘంగా 45 రోజుల తరువాత పట్టణం లోనికి ప్రవేశించి తమ ఆనందాన్ని దూరం దూరముగా ఉంటూనే ప్రకటించారు.  రేపటి నుండి 4.0 లాక్ డౌన్ ప్రకటన వస్తే మరిన్ని  వెసులు బాట్లుతో భీమవరం పట్టణంలో మార్కెట్ మరల పూర్తీ స్థాయికి కాస్త దగ్గరగా కళకళ లాడుతుందని భావించవచ్చు. గ్రీన్ జోన్ లోకి వచ్చేవరకు ప్రజలు కూడా కరోనా వైరస్ రాకుండా అప్రమత్తతతో ఉండాలని, అధికారులకు, పోలీస్, సానిటరీ సిబ్బందికి , వార్డు వాలంటీర్లు కు, దాతలకు అభినందనలు తెలుపుతూ.. సిగ్మా ప్రసాద్ కాలమ్స్.. www.sigmatelugu.com

 

 
 

Related Stories