తాజా వార్తలు   వారిని,వీరిని రెచ్చగొడుతూ..బాబు సినిమాలు..కొడాలి ఘాటు | FLASH..భారత్ లో కరోనా వైరస్ సత్తా మరో 2 వారాలలో.. | ఏపీ లో స్కూళ్ళు తెరవడం.. మరోసారి వాయిదా | దీపికా కిడ్నప్ కధ సుఖంతం..దిమ్మతిరిగే ట్విస్ట్ | భారత్ లోనే ఎక్కువ పన్ను చెల్లించిన ట్రాంప్ | ఏపీ హైకోర్టులో పిటిషన్లు వేసిన కృష్ణంరాజు, అశ్వనీదత్ | ఎన్డీయే నుంచి రెండు సింహాలు వచ్చేసాయి..శివసేన ఘాటు | బాలు కు భారత రత్న ఇవ్వండి..సీఎం జగన్ ప్రధానికి విజ్ఞప్తి | వచ్చే నెల 16 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు | సామాన్యుడు ఎలా బ్రతకాలి? కూరగాయలు ధరలు కూడా.. |

నిమ్మగడ్డ.. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్ట్ కు వెళతాం.. అంబటి

Updated: May 29, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్‌ను రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా తిరిగి నియమించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ‌తామ‌ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు ప్రకటించారు. .నేడు, శుక్రవారం సాయంత్రం   తాడేప‌ల్లిలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. "నెల రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌పై ప్ర‌భుత్వం ఆర్డినెన్స్ జారీ చేయ‌గా ఈసీ నిమ్మగడ్డ రమేష్ పదవిని కోల్పోయారు. ఆయన స్థానంలో జస్టిస్ కనగరాజ్ నియయాకం జ‌రిగింది. దీనిపై టీడీపీ, బీజేపీ నేతలు హైకోర్టుకు వెళ్ళారు. ఈ క్ర‌మంలో నేడు,  ప్ర‌భుత్వ ఆర్డినెన్స్ జీవోల‌ను ర‌ద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వచ్చింది.  అయితే కొన్ని పరిస్థితులలో  మనకు న్యాయం జ‌ర‌గ‌క‌పోవ‌చ్చు. అలాంట‌ప్పుడు నిరాశ చెందకుండా  పై కోర్టుకు వెళ్లే అవ‌కాశం ఉంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఇదే చేసేది.. నిజానికి  స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్యం, డబ్బు అరికట్టాలని సీఎం జగన్ ఆదేశాల మేరకు  ప్రభుత్వం చట్టం తీసుకువస్తే దానికి వ్యతిరేకంగా చంద్రబాబు పంపిన లేఖపై నిమ్మగడ్డ రమేష్ సంతకం పెట్టారు. ఇటువంటి లేఖల వల్ల ప్రజాస్వామ్యం మంట కలిసిపోతుంద‌ని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. . 

 
 

Related Stories