తాజా వార్తలు   వారిని,వీరిని రెచ్చగొడుతూ..బాబు సినిమాలు..కొడాలి ఘాటు | FLASH..భారత్ లో కరోనా వైరస్ సత్తా మరో 2 వారాలలో.. | ఏపీ లో స్కూళ్ళు తెరవడం.. మరోసారి వాయిదా | దీపికా కిడ్నప్ కధ సుఖంతం..దిమ్మతిరిగే ట్విస్ట్ | భారత్ లోనే ఎక్కువ పన్ను చెల్లించిన ట్రాంప్ | ఏపీ హైకోర్టులో పిటిషన్లు వేసిన కృష్ణంరాజు, అశ్వనీదత్ | ఎన్డీయే నుంచి రెండు సింహాలు వచ్చేసాయి..శివసేన ఘాటు | బాలు కు భారత రత్న ఇవ్వండి..సీఎం జగన్ ప్రధానికి విజ్ఞప్తి | వచ్చే నెల 16 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు | సామాన్యుడు ఎలా బ్రతకాలి? కూరగాయలు ధరలు కూడా.. |

కొత్తగా తెలంగాణాలో 117 ఏపీలో 33 కరోనా కేసులు..

Updated: May 29, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్:  తెలుగు రాష్ట్రాల్లో, రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. తెలంగాణలో రికార్డు స్థాయిలో 117 కేసులు నమోదు అయ్యాయి. సౌదీ అరేబియా నుంచి వచ్చిన 49 మంది కరోనా బారిన పడగా.. ఇద్దరు వలస కార్మికులకు వైరస్ సోకింది. మరో 66 మంది స్థానికులకు కరోనా సోకినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 2,256కు చేరింది. కరోనా బారిన పడి ఇప్పటి వరకు 67 మంది మృతి చెందారు. మరో 1,345 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 844 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.   
ఆంధ్ర ప్రదేశ్ లో  కరోనా కేసుల తాజా బులెటిన్‌ను రాష్ట్ర వైద్య, శాఖ  నేడు, శుక్రవారం విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 11638 కరోనా సాంపిల్స్‌ పరీక్షించగా.. 33 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. శుక్రవారం ఒక్కరోజే 79 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కాగా రాష్ట్రంలో మొత్తం నమోదైన 2874 పాజిటివ్‌ కేసులకు 2037  మంది పూర్తిగా కోలుకోగా... 60 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 777 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.వైరస్ సోకినవారిలో ఎక్కువమంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు, విదేశాల నుంచి వస్తున్నవారికి నిర్వహిస్తున్న పరీక్షల్లో  ఎక్కువ మందికి కరోనా వైరస్ బయటపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.మరోవైపు దేశంలో కరోనా వైరస్ పాజిటివ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. 
 
 

Related Stories