తాజా వార్తలు   వారిని,వీరిని రెచ్చగొడుతూ..బాబు సినిమాలు..కొడాలి ఘాటు | FLASH..భారత్ లో కరోనా వైరస్ సత్తా మరో 2 వారాలలో.. | ఏపీ లో స్కూళ్ళు తెరవడం.. మరోసారి వాయిదా | దీపికా కిడ్నప్ కధ సుఖంతం..దిమ్మతిరిగే ట్విస్ట్ | భారత్ లోనే ఎక్కువ పన్ను చెల్లించిన ట్రాంప్ | ఏపీ హైకోర్టులో పిటిషన్లు వేసిన కృష్ణంరాజు, అశ్వనీదత్ | ఎన్డీయే నుంచి రెండు సింహాలు వచ్చేసాయి..శివసేన ఘాటు | బాలు కు భారత రత్న ఇవ్వండి..సీఎం జగన్ ప్రధానికి విజ్ఞప్తి | వచ్చే నెల 16 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు | సామాన్యుడు ఎలా బ్రతకాలి? కూరగాయలు ధరలు కూడా.. |

APఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ‌‌ను కొనసాగించాల్సిందే..హైకోర్టు

Updated: May 29, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్:  ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్‌ ఇచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ ‌కుమార్‌‌ను కొనసాగించాల్సిందేనని ఉన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.  నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. ఆర్టికల్ 213 ప్రకారం ఆర్డినెన్స్ తెచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని ధర్మాసనం తేల్చిచెప్పింది. హైకోర్టు తీర్పుతో ప్రస్తుతం కమిషనర్ కనగరాజ్ పదవి నుంచి తొలగిస్తారా? రాష్ట్ర ప్రభుత్వం  మరోసారి, తాజా  తీర్పు ఫై  సుప్రీం కోర్ట్ కు వెళ్లే అవకాశం ఉందా? అన్నది ఇంకా వివరణ రావలసి ఉంది. .. ఇదిలా ఉండగా,    ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు బాధ్యతలు తీసుకుంటున్నానని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ ప్రకటించారు.  నేడు  శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన... గతంలో మాదిరిగానే నిష్పాక్షికంగా బాధ్యతలు నిర్వర్తిస్తానని ఆయన అన్నారు. అన్నిరాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకొని.. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. వ్యక్తులు కాదు... రాజ్యాంగ సంస్థలు, విలువలు శాశ్వతమని రమేశ్ పేర్కొన్నారు.  హైకోర్టు తీర్పు  ఫై పవన్ కళ్యాణ్ తన హర్షం వ్యక్తం చేస్తూ  ప్రజాస్వామ్య  విజయం గా అభివర్ణించారు. 

 
 

Related Stories