తాజా వార్తలు   వారిని,వీరిని రెచ్చగొడుతూ..బాబు సినిమాలు..కొడాలి ఘాటు | FLASH..భారత్ లో కరోనా వైరస్ సత్తా మరో 2 వారాలలో.. | ఏపీ లో స్కూళ్ళు తెరవడం.. మరోసారి వాయిదా | దీపికా కిడ్నప్ కధ సుఖంతం..దిమ్మతిరిగే ట్విస్ట్ | భారత్ లోనే ఎక్కువ పన్ను చెల్లించిన ట్రాంప్ | ఏపీ హైకోర్టులో పిటిషన్లు వేసిన కృష్ణంరాజు, అశ్వనీదత్ | ఎన్డీయే నుంచి రెండు సింహాలు వచ్చేసాయి..శివసేన ఘాటు | బాలు కు భారత రత్న ఇవ్వండి..సీఎం జగన్ ప్రధానికి విజ్ఞప్తి | వచ్చే నెల 16 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు | సామాన్యుడు ఎలా బ్రతకాలి? కూరగాయలు ధరలు కూడా.. |

లాక్‌డౌన్ ముగింపు ఫై పునరాలోచన..1 రోజులో 7,466 కేసులు

Updated: May 29, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్:  మే 31తో లాక్‌డౌన్‌ను ముగించాలన్న నిర్ణయంపై కేంద్రం పునరాలోచిస్తున్నట్లు తెలిసింది. తొలుత కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న 11 నగరాలకే లాక్‌డౌన్‌ పొడిగింపును పరిమితం చేయాలని భావించినప్పటికీ.. తాజాగా సడలింపులతో కూడిన లాక్‌డౌన్‌ను  మొత్తం  దేశవ్యాప్తంగా అమలు చేయాలన్నది కేంద్రం యోచనగా తెలుస్తోంది. భారత్‌లో  ఇటీవల వేగంగా  పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు తో మరల ఆందోళన మొదలయింది.  గడచిన 24 గంటల్లో భారత్‌లో ఏకంగా భారీ స్థాయిలో 7,466 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కరోనా మరణాల సంఖ్య కూడా మరింత ఆందోళనకు గురిచేస్తోంది. గడచిన 24 గంటల్లో 175 మంది మరణించినట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో.. భారత్‌లో కరోనా మరణాల సంఖ్య 4706కు చేరింది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,65,799కు చేరింది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 89,987. భారత్‌లో కరోనా సోకిన వారిలో ఇప్పటివరకూ 71,105 మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వడం మాత్రం భరోసా ఇచ్చే అంశమే.. అంత ఒక ఎత్తయితే ..  ఒక్క మహారాష్ట్రలోని సుమారు 57 వేలు కరోనా పాజిటివ్ లు రావడం అందులో సుమారు 1900 మంది మరణించడం తీవ్ర ఆందోళనకర అంశం . 
 
 
 

Related Stories