తాజా వార్తలు   వారిని,వీరిని రెచ్చగొడుతూ..బాబు సినిమాలు..కొడాలి ఘాటు | FLASH..భారత్ లో కరోనా వైరస్ సత్తా మరో 2 వారాలలో.. | ఏపీ లో స్కూళ్ళు తెరవడం.. మరోసారి వాయిదా | దీపికా కిడ్నప్ కధ సుఖంతం..దిమ్మతిరిగే ట్విస్ట్ | భారత్ లోనే ఎక్కువ పన్ను చెల్లించిన ట్రాంప్ | ఏపీ హైకోర్టులో పిటిషన్లు వేసిన కృష్ణంరాజు, అశ్వనీదత్ | ఎన్డీయే నుంచి రెండు సింహాలు వచ్చేసాయి..శివసేన ఘాటు | బాలు కు భారత రత్న ఇవ్వండి..సీఎం జగన్ ప్రధానికి విజ్ఞప్తి | వచ్చే నెల 16 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు | సామాన్యుడు ఎలా బ్రతకాలి? కూరగాయలు ధరలు కూడా.. |

ఏపీలో 5వ విడుత ఉచిత రేషన్ పంపిణి ప్రారంభం

Updated: May 29, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలను ఆదుకోవడానికి  ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 4 విడతలు  రేషన్ ఉచితంగా పంపిణి చేసిన ప్రభుత్వం నేడు, శుక్రవారం  ఐదో విడత ఉచిత రేషన్‌ పంపిణీ  ప్రారంభించింది.  బియ్యం కార్డుదారులకు మనిషికి 5 కిలోల చొప్పున బియ్యం, కేజీ కందిపప్పు పంపిణీ జరుగుతోంది. రాష్ట్ర్రంలోని 28,354 రేషన్‌ దుకాణాల ద్వారా సరుకులను పంపిణీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్డులు ఉన్న మొత్తం 1,48,05,879 కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. రేషన్ తీసుకునేందుకు దుకాణాల వారీగా టైం స్లాట్ కూపన్లు అందజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల ప్రకారం లబ్ధిదారులకు బయో మెట్రిక్ తప్పనిసరి చేశారు.పోర్టబులిటీ ద్వారా లబ్ధిదారులు ఎక్కడ ఉంటే అక్కడే సరుకులు తీసుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. రేషన్ షాప్ కౌంటర్ల వద్ద అందుబాటులో శానిటైజర్లు ఉంచారు.

 
 

Related Stories