తాజా వార్తలు   వారిని,వీరిని రెచ్చగొడుతూ..బాబు సినిమాలు..కొడాలి ఘాటు | FLASH..భారత్ లో కరోనా వైరస్ సత్తా మరో 2 వారాలలో.. | ఏపీ లో స్కూళ్ళు తెరవడం.. మరోసారి వాయిదా | దీపికా కిడ్నప్ కధ సుఖంతం..దిమ్మతిరిగే ట్విస్ట్ | భారత్ లోనే ఎక్కువ పన్ను చెల్లించిన ట్రాంప్ | ఏపీ హైకోర్టులో పిటిషన్లు వేసిన కృష్ణంరాజు, అశ్వనీదత్ | ఎన్డీయే నుంచి రెండు సింహాలు వచ్చేసాయి..శివసేన ఘాటు | బాలు కు భారత రత్న ఇవ్వండి..సీఎం జగన్ ప్రధానికి విజ్ఞప్తి | వచ్చే నెల 16 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు | సామాన్యుడు ఎలా బ్రతకాలి? కూరగాయలు ధరలు కూడా.. |

సినీ ప్రముఖులపై బాలయ్య ఆగ్రహం..నాగబాబు రచ్చ..2 వర్గాలుగా..

Updated: May 28, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ తో నేడు, గురువారం చిరంజీవి, నాగార్జున, రాజమౌళి వంటి సినీప్రముఖులు చర్చలు పాల్గొన్నారు. సీనియర్  హీరో బాలకృష్ణ దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ..కొద్దీ రోజుల క్రితం సినిమా షూటింగులు మొదలు పెట్టే విషయంపై సీఎం కేసీఆర్‌ను సినీ ఇండస్ట్రీ ప్రముఖులు కలిసి చర్చించిన విషయం తనకు తెలీదని బాలకృష్ణ అన్నారు. ఆ సమావేశానికి రావాలని తనను ఏ ఒక్కరూ  పిలవలేదు, సమావేశానికి వెళ్ళినవారు  తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కూర్చుని హైదరాబాద్‌లో భూములు పంచుకుంటున్నారా? అంటూ బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. బాలకృష్ణ వ్యాఖ్యలపై మంత్రి తలసాని  వెంటనే స్పందించారు. బాలకృష్ణ ఎందుకు మాట్లాడారో తెలియదని , అయితే  ఇండస్ట్రీలో యాక్టివ్‌గా ఉన్నవారందరినీ సమావేశానికి పిలిచామని చెప్పారు. ఇండస్ట్రీని అంతా పిలిచి సమావేశం పెట్టమంటే తనకు అభ్యంతరంలేదన్నారు. సీఎం కేసీఆర్‌కు అన్ని విషయాలు వివరిస్తామని తలసాని స్పష్టం చేశారు. టాలీవుడ్ ప్రముఖుల మీటింగ్‌కు బాలకృష్ణను పిలవకపోవడం పొరపాటేనని తెలుగు సినీ నిర్మాతల మండలి కీలక నేతలు విచారం వ్యక్తం చేసారు.  అయితే బాలకృష్ణ వ్యాఖ్యలపై నాగబాబు మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బాలకృష్ణ నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. వ్యక్తిగత స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నానంటూ నాగబాబు వీడియో విడుదల చేశారు. భూములు పంచుకోవడానికి కలిశారనడం బాధాకరమన్నారు. బాలకృష్ణ నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతారా? అని ప్రశ్నించారు. అంతకంటే పది రెట్లు ఎక్కువ మాట్లాడగలమన్నారు. ‘‘ఇండస్ట్రీకి మీరే కింగ్‌ కాదు.. బాధ్యతగా మాట్లాడడం నేర్చుకోవాలి. టాలీవుడ్‌కు..తెలంగాణ ప్రభుత్వానికి బాలకృష్ణ క్షమాపణ చెప్పాలి.’’ అని నాగబాబు డిమాండ్ చేశారు. దీనిపై పలువురు నిర్మాతలు నాగబాబు ను నీకు బాలయ్య స్థాయితో పోలిక? అంటూ వ్యాఖ్యానాలు మొదలెట్టారు ఇప్పటికే.మొత్తానికి తెలుగు సినీ ఇండస్ట్రీ లో ఈ ప్రకంపనలు  ఇంతటితో ఆగేలా లేవు.. 

 
 

Related Stories