తాజా వార్తలు   వారిని,వీరిని రెచ్చగొడుతూ..బాబు సినిమాలు..కొడాలి ఘాటు | FLASH..భారత్ లో కరోనా వైరస్ సత్తా మరో 2 వారాలలో.. | ఏపీ లో స్కూళ్ళు తెరవడం.. మరోసారి వాయిదా | దీపికా కిడ్నప్ కధ సుఖంతం..దిమ్మతిరిగే ట్విస్ట్ | భారత్ లోనే ఎక్కువ పన్ను చెల్లించిన ట్రాంప్ | ఏపీ హైకోర్టులో పిటిషన్లు వేసిన కృష్ణంరాజు, అశ్వనీదత్ | ఎన్డీయే నుంచి రెండు సింహాలు వచ్చేసాయి..శివసేన ఘాటు | బాలు కు భారత రత్న ఇవ్వండి..సీఎం జగన్ ప్రధానికి విజ్ఞప్తి | వచ్చే నెల 16 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు | సామాన్యుడు ఎలా బ్రతకాలి? కూరగాయలు ధరలు కూడా.. |

విశాఖ కు మాత్రమే సత్తా ఉంది..హోదా కూడా సాధిస్తా..సీఎం జగన్

Updated: May 28, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్:  మన పాలన-మీ సూచన కార్యక్రమంలో భాగంగా నేడు, గురువారం పారిశ్రామిక రంగంపై తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్‌లో సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగ అవకాశాల పెంపుపై . పారిశ్రామికవేత్తలు, లబ్ధిదారులతో సీఎం జగన్‌ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ..హైదరాబాద్‌, బెంగళూరులాంటి నగరాలతో పోటీపడే సత్తా విశాఖకు మాత్రమే ఉందని . విశాఖలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం అత్యున్నతస్థాయి ఇంజినీరింగ్‌ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు.. ఇటీవల ఎల్జీ పాలిమర్స్‌లో జరిగిన ప్రమాదంపై వేగంగా స్పందించాం. రూ.50 కోట్లు విడుదల చేసి బాధితులకు త్వరితంగా అందజేశాం. . సంఘటన జరిగిన గంటలోపే అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఘటనపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వ కమిటీలు విచారణ రిపోర్ట్ వచ్చాక దోషులపై చర్యలు ఉంటాయి.. ‘రాష్ట్ర విభజనతో మనకు నష్టమే జరిగింది. ప్రత్యేక హోదా ఇస్తారని మాట ఇచ్చి ఇవ్వలేదు. ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే అనేక రాయితీలు ఇచ్చేవారు.. 2014-19 వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కాపురం చేసినా హోదా రాలేదు. ప్రత్యేక హోదా ఇస్తే ఎవరితోనైనా కలిసిపోతామని ఆనాడే చెప్పాం. కానీ కేంద్రంలో పూర్తి మెజార్టీతో ప్రభుత్వం ఏర్పడింది. ఎప్పుడు అవకాశం వచ్చినా కేంద్రంతో ప్రత్యేక హోదా గురించి అడుగుతూనే ఉన్నాం. ఎప్పటికైనా ప్రత్యేక హోదాను సాధించి తీరుతాం. లోక్‌సభలో నాలుగో అతిపెద్ద పార్టీగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉందని సీఎం జగన్‌ ధీమా వ్యక్తం చేసారు.  గత ప్రభుత్వం రాయితీలను కూడా అమ్ముకుందని.. కానీ ఈ ప్రభుత్వంలో అవినీతికి తావులేదని స్పష్టం చేశారు. 
 
 

Related Stories