సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి జేష్ఠమాసం జాతర ప్రారంభం సందర్భం గా రేపు శనివారం సాయంత్రం 5గంటల 15నిమిషాలకు శ్రీ అమ్మవారిని నిలబెట్టే కార్యక్రమం గతానికి బిన్నంగా కేవలం దేవాలయ అర్చకులు , సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు లాక్ డౌన్ నేపథ్యంలో భక్తులకు అనుమతి లేదని దేవాలయ ఇఓ ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీ మావుళ్ళమ్మవారిని నిలబెట్టిన కారణంగా ఈ జేష్ఠమాసం లో అమ్మవారి ఘట్టాలతో మేళతాళాలతో డప్పు శబ్దాలతో నృత్యం చేస్తూ పట్టణంలోని ప్రతి ఇంటికి కి అమ్మవారి దర్శన భాగ్యం కలుగ జెయ్యడం , భక్తులు పసుపు నీళ్లతో అమ్మకు స్వగతం పలకడం సంప్రదాయం ఆనవాయితీగా వస్తుంది. అమ్మ వారి రాకతో ప్రతి ఇంట అనేక శుభాలు జరుగుతాయని, భక్తుల ప్రగాఢ నమ్మకం..