తాజా వార్తలు   ఆటో,ట్యాక్సీ లబ్దిదారులకు 2వ సారి 10 వేల.రూ చప్పున.. సీఎం | శుభవార్త.. 8 నుంచి ఏపీ లో హోటల్స్ తెరవడానికి పచ్చజెండా.. | ఇకపై భీమవరం మార్కెట్ రాత్రి 7 గంటల వరకు..MLA గ్రంధి.. | ట్రాంప్ సంచలనమ్ ..అమెరికాకు చైనా విమానాలు నిషేధం | తెలంగాణాలో3000 దాటిన కరోనా కేసులు..హైదరాబాద్ లో 2,105.. | తెలంగాణలో కొత్తగా 87కరోనా కేసులు..1,273 చికిత్స పొందుతున్నారు | ఏపీలో కొత్తగా 79 కరోనా కేసులు..967 మంది కి చికిత్స | ఏపీలో సచివాలయాలు రంగులు మార్చండి .సుప్రీం తీర్పు | దేశంలోఒక్క రోజులోసుమారు 9వేల కరోనా కేసులు..ఆ 2రాష్ట్రాలలో.. | దేశంలో ప్రజా ఆదరణతో టాప్ 4 సీఎం జగన్ .. |

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌..ట్రైలర్‌ రెండు రోజుల్లో కోటి వ్యూస్‌..వర్మ

Updated: February 18, 2019

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌. ..అసలు నిజాలు చెపుతాను అంటూ  ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రేమికుల రోజు సందర్భంగా రిలీజ్ అయిన ట్రైలర్ ఆ వేడిని మరింత రాజేసింది. ఈ ట్రైలర్‌కు భారీ రెస్సాన్స్‌రావటమే కాదు రికార్డ్ వ్యూస్‌తో సోషల్ మీడియా  పాటు రాజకీయ వర్గాలలో ప్రకంపనలు పుట్టింస్తుంది. 
తాజాగా ఈ విషయాన్ని రామ్‌ గోపాల్‌ వర్మ అభిమానులతో పంచుకున్నారు. రిలీజ్‌ అయిన గంటన్నరలోనే మిలియన్‌ వ్యూస్‌ సాధించిన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ట్రైలర్‌ రెండు రోజుల్లో కోటి వ్యూస్‌ సాధించినట్టుగా వర్మ ప్రకటించాడు. . ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న లక్ష్మీస్‌ ఎన్టీఆర్ మార్చి మొదటి వారంలో విడుదల కానుంది.
 
 

Related Stories