తాజా వార్తలు   ఆటో,ట్యాక్సీ లబ్దిదారులకు 2వ సారి 10 వేల.రూ చప్పున.. సీఎం | శుభవార్త.. 8 నుంచి ఏపీ లో హోటల్స్ తెరవడానికి పచ్చజెండా.. | ఇకపై భీమవరం మార్కెట్ రాత్రి 7 గంటల వరకు..MLA గ్రంధి.. | ట్రాంప్ సంచలనమ్ ..అమెరికాకు చైనా విమానాలు నిషేధం | తెలంగాణాలో3000 దాటిన కరోనా కేసులు..హైదరాబాద్ లో 2,105.. | తెలంగాణలో కొత్తగా 87కరోనా కేసులు..1,273 చికిత్స పొందుతున్నారు | ఏపీలో కొత్తగా 79 కరోనా కేసులు..967 మంది కి చికిత్స | ఏపీలో సచివాలయాలు రంగులు మార్చండి .సుప్రీం తీర్పు | దేశంలోఒక్క రోజులోసుమారు 9వేల కరోనా కేసులు..ఆ 2రాష్ట్రాలలో.. | దేశంలో ప్రజా ఆదరణతో టాప్ 4 సీఎం జగన్ .. |

యాత్ర విజయోత్సవ సభలో ముమ్మూటి ఆనందం ఎంతంటే..

Updated: February 17, 2019

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: మహి వి. రాఘవ్‌ దర్శకత్వంలో మమ్ముట్టి లీడ్‌ రోల్‌లో తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. శివ మేక సమర్పణలో విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా శుక్రవారం వైజాగ్‌లో నిర్వహించిన ‘బ్లాక్ట్‌బస్టర్‌ మీట్‌’లో మమ్ముట్టి మాట్లాడుతూ– ‘‘అందరికీ నమస్కారం. నాకు తెలుగు రాదు.. నన్ను క్షమించండి. తెలుగు స్పష్టంగా మాట్లాడటం ఇంకా రాలేదు. నా డైలాగ్స్‌కు జాగ్రత్తగా డబ్బింగ్‌ చెప్పుకున్నాను. ఉగ్రవాద దాడిలో అమరులైన వీరజవాన్లకు సెల్యూట్‌ చేస్తున్నానుదర్శక–నిర్మాతలు నాకు మ్యాగ్జిమమ్‌ కంఫర్ట్‌ లెవల్స్‌ ఇచ్చారు. నా నుంచి కొత్తవిషయాలు నేర్చుకున్నానని మహి చెప్పారు. కానీ, నేర్చుకున్నది నేను. పాత్ర కోసం కొత్త భాష నేర్చుకున్నాను.యాత్ర’ సినిమాకి ముందు తెలుగులో చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ ఆసక్తికరంగా అనిపించకపోవడంతో చేయలేదు. అయితే ‘యాత్ర’ సినిమాను కాదనలేకపోయాను. కథ బాగుంది.. మంచి ఎమోషనల్‌ టచ్‌ కూడా ఉంది. ప్రజల నాయకుడైన ఒక గొప్ప రాజకీయ నాయకుడి కథ ఇది. ప్రజలను అర్థం చేసుకోకపోతే రాజకీయ నాయకుడు.. ప్రజానాయకుడు కావడం కష్టం. మన దేశంలో ప్రజాస్వామ్యం ఉంది. ప్రజలు మెచ్చిన నాయకుడే రూలర్‌ అవుతారు’’  సినిమాలను చూడటంలో తెలుగు ప్రేక్షకులవారి అభిరుచి మారింది. తెలుగులో మరిన్ని మంచి సినిమాలు రావాలి.వైఎస్‌ఆర్‌గారిలా నన్ను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఆయన పాత్రలో నటించడం నా అదృష్టం’’ అని హీరో మమ్ముట్టి అన్నారు.
 
 
 

Related Stories