తాజా వార్తలు   కరోనా కేసులలో భారత్ వేగం ఎంత ఆందోళనకరమంటే.. | ఆటో,ట్యాక్సీ లబ్దిదారులకు 2వ సారి 10 వేల.రూ చప్పున.. సీఎం | శుభవార్త.. 8 నుంచి ఏపీ లో హోటల్స్ తెరవడానికి పచ్చజెండా.. | ఇకపై భీమవరం మార్కెట్ రాత్రి 7 గంటల వరకు..MLA గ్రంధి.. | ట్రాంప్ సంచలనమ్ ..అమెరికాకు చైనా విమానాలు నిషేధం | తెలంగాణాలో3000 దాటిన కరోనా కేసులు..హైదరాబాద్ లో 2,105.. | తెలంగాణలో కొత్తగా 87కరోనా కేసులు..1,273 చికిత్స పొందుతున్నారు | ఏపీలో కొత్తగా 79 కరోనా కేసులు..967 మంది కి చికిత్స | ఏపీలో సచివాలయాలు రంగులు మార్చండి .సుప్రీం తీర్పు | దేశంలోఒక్క రోజులోసుమారు 9వేల కరోనా కేసులు..ఆ 2రాష్ట్రాలలో.. |

నిర్మల..2.0..రైతులు,వలస కూలీలు,మధ్యతరగతి కి భారీ ప్యాకేజీ

Updated: May 18, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: దేశంలో  కరోనా కట్టడికి లాక్ డౌన్ విధింపుతో దారుణంగా పతనమయిన  ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజ్‌లో వ్యవసాయం, రైతులు  వలస కూలీల సంక్షేమానికి, మధ్య తరగతి ప్రజలకు భరోసా ఇస్తూ .తాజగా చేపట్టిన చర్యలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు గురువారం 2వ విడతగా వివరాలు వివరించారు. దీనిలో రైతులకు తక్కువ వడ్డీతో రుణాలు అందిస్తామని, వారి కోసం పలు సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ప్రకటించారు. రూ 86,600 కోట్ల వ్యవసాయ రుణాలు ఆమోదించామని తెలిపారు. పాతిక లక్షల మంది నూతన కిసాన్‌కార్డు దారులకు రూ 25,000 కోట్ల రుణం అందచేస్తామని తెలిపారు. వలస కూలీలకు రేషన్ కార్డులు లేకపోయినా 2 నెలల పాటు పౌష్ఠిక ఆహారం ఉచితంగా అందించడం తో పాటు  వారు ఉండటానికి అతి తక్కువ అద్దెతో కేంద్రమే కాటేజీలు ఏర్పాటు చేస్తుందని భరోసా ఇచ్చారు. ఆగస్టు నెల కల్లా రేషన్ కార్డు తో దేశంలో ఎక్కడ నుండయినా రేషన్ సరకులు పొందే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. చెబుతూ మధ్యతరగతి కోసం ప్రత్యేకంగా క్రెడిట్‌ లింక్డ్‌ సబ్సిడీ పథకం ప్రవేశపెడతామని మంత్రి వెల్లడించారు.ప్యాకేజ్‌ వివరాలు లోకి వెళితే.. మార్చి, ఏప్రిల్‌లో రైతులకు రూ 86,600 కోట్ల రుణాల ఆమోదం.. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణకు రాష్ట్రాలకు రూ .6700 కోట్లు..నాబార్డు ద్వారా 29,500 గ్రామీణ బ్యాంకులకు నిధులు..రబీలో సన్నకారు, మధ్యతరహా రైతులకు రూ 30 వేల కోట్ల రుణాలు..సహకార బ్యాంకుల ద్వారా 3 వేల కోట్ల మంది రైతులకు అదనంగా రుణాలు...చిన్న వ్యాపారులను ఆదుకునేందుకు వివిధ పథకాలు..50 లక్షల వీధి వ్యాపారులకు రూ. 5,000 కోట‍్ల రుణాలు ఇవ్వడం.. వలస కార్మికుల ఉపాథికి రూ 10,000 కోట్లు..ఎస్‌ఆర్‌డీఎఫ్‌ కింద  11,002 కోట్ల నిధులు..అర్బన్‌, సెమీ-అర్బన్‌లో ఉపాథి కల్పనకు రూ. 6000 కోట్లు కేటాయింపు.. మధ్య తరగతి ప్రజలకు వారికి క్రెడిట్‌ లింక్డ్‌ సబ్సిడీ పథకం.. ఇంకా రూ.6-18 లక్షల వార్షికాదాయం ఉన్న వారికి రాయితీ 2021 మార్చి వరకూ ఈ పథకం వర్తింపు ఇచ్చారు. 
 
 
 
 
 

Related Stories