తాజా వార్తలు   కరోనా కేసులలో భారత్ వేగం ఎంత ఆందోళనకరమంటే.. | ఆటో,ట్యాక్సీ లబ్దిదారులకు 2వ సారి 10 వేల.రూ చప్పున.. సీఎం | శుభవార్త.. 8 నుంచి ఏపీ లో హోటల్స్ తెరవడానికి పచ్చజెండా.. | ఇకపై భీమవరం మార్కెట్ రాత్రి 7 గంటల వరకు..MLA గ్రంధి.. | ట్రాంప్ సంచలనమ్ ..అమెరికాకు చైనా విమానాలు నిషేధం | తెలంగాణాలో3000 దాటిన కరోనా కేసులు..హైదరాబాద్ లో 2,105.. | తెలంగాణలో కొత్తగా 87కరోనా కేసులు..1,273 చికిత్స పొందుతున్నారు | ఏపీలో కొత్తగా 79 కరోనా కేసులు..967 మంది కి చికిత్స | ఏపీలో సచివాలయాలు రంగులు మార్చండి .సుప్రీం తీర్పు | దేశంలోఒక్క రోజులోసుమారు 9వేల కరోనా కేసులు..ఆ 2రాష్ట్రాలలో.. |

ఆ టికెట్స్.డబ్బు ఇచ్చేస్తాం. ప్రత్యేక రైళ్లు నడుస్తాయి..రైల్వేశాఖ

Updated: May 18, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: కరోనా కట్టడి నేపథ్యంలో దేశంలో  గత 51 రోజులుగా లాక్ డౌన్ కొనసాగుతున్న దృష్ట్యా  లాక్‌డౌన్‌కు ముందు తీసుకున్న అడ్వాన్స్‌ టిక్కెట్లు అన్నీ రద్దవుతాయని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జూన్ 30 వరకు ప్రయాణానికి తీసుకున్న టిక్కెట్లన్నీ రద్దవుతాయని తెలిపింది. జూన్ 30 లేదా అంతకుముందు ప్రయాణానికి మార్చి 25 లోపు బుక్ చేసుకున్న అన్ని రైలు టిక్కెట్లు రద్దు అవుతాయని, వినియోగదారులకు పూర్తి నగదు వాపసు ఇవ్వనున్నట్లు వివరించింది. ప్రత్యేక రైళ్లకు మినహా మిగిలిన అన్ని రైళ్ల రిజర్వేషన్లు జూన్‌ 30 వరకు రద్దు చేసినట్టు రైల్వేశాఖ వెల్లడించింది. ఆన్‌లైన్‌, కౌంటర్లలో రిజర్వేషన్ చేయిస్తే ఛార్జీలు తిరిగి చెల్లించనుంది. ఆన్‌లైన్‌లో చెల్లిస్తే ప్రయాణికుల ఖాతాకు జమ చేస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. కౌంటర్లలో రిజర్వేషన్లు చేయించినవారికి ప్రత్యేక సదుపాయం ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ నెల 12 నుంచి మొదలైన ప్రత్యేక రైళ్లు మాత్రం కొనసాగుతాయని స్పష్టం చేసింది. . 

 
 

Related Stories