తాజా వార్తలు   కరోనా కేసులలో భారత్ వేగం ఎంత ఆందోళనకరమంటే.. | ఆటో,ట్యాక్సీ లబ్దిదారులకు 2వ సారి 10 వేల.రూ చప్పున.. సీఎం | శుభవార్త.. 8 నుంచి ఏపీ లో హోటల్స్ తెరవడానికి పచ్చజెండా.. | ఇకపై భీమవరం మార్కెట్ రాత్రి 7 గంటల వరకు..MLA గ్రంధి.. | ట్రాంప్ సంచలనమ్ ..అమెరికాకు చైనా విమానాలు నిషేధం | తెలంగాణాలో3000 దాటిన కరోనా కేసులు..హైదరాబాద్ లో 2,105.. | తెలంగాణలో కొత్తగా 87కరోనా కేసులు..1,273 చికిత్స పొందుతున్నారు | ఏపీలో కొత్తగా 79 కరోనా కేసులు..967 మంది కి చికిత్స | ఏపీలో సచివాలయాలు రంగులు మార్చండి .సుప్రీం తీర్పు | దేశంలోఒక్క రోజులోసుమారు 9వేల కరోనా కేసులు..ఆ 2రాష్ట్రాలలో.. |

మొగల్తూరు ను కదిలించిన తల్లి ఇద్దరు కూతుర్ల మరణాలు

Updated: February 20, 2019

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: తాజగా  నిన్న సోమవారం రాత్రి, పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు గాంధీబొమ్మల సెంటర్‌ సమీపంలో నివాసం ఉండే నల్లిమిల్లి లక్ష్మీప్రసన్న(28)  ఇంట్లో ఉరివేసుకుని చనిపోయింది. తను చని పోవడానికి ముందు పెద్ద కుమార్తె రోజాశ్రీలక్ష్మి (7), చిన్న కుమార్తె జాహ్నవి (5) లను కూడా దారుణంగా తువ్వాలుతో గొంతుబిగించి చంపేసింది. ఆర్థిక ఇబ్బందులు, భర్త వేధింపులు, కుటుంబ కలహాల వల్లే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్టు   భావిస్తున్నారు ? దీంతో మొగల్తూరులో విషాదఛాయలు అలముకున్నాయి. రైస్‌ మిల్లు జయమాని అయిన లక్ష్మీప్రసన్న భర్త నల్లిమిల్లి వెంకటరామాంజనేయరెడ్డిని  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం  రాత్రి 7.15గంటల సమయంలో మిల్లు నుంచి ఇంటికి వచ్చిన రామాంజనేయరెడ్డి ఇంట్లో భార్య ఫ్యాన్‌కు ఉరివేసుకుని, మంచంపై ఇద్దరు పిల్లలు విగత జీవులుగా పడిఉండటాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో మొగల్తూరు ఎస్సై వచ్చి వెంటనే రామాంజనేయరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.  ఆ తల్లి మనస్సుకు ఎంత బాధ కలిగిందోకాని ముందు బంగారుబొమ్మలుగా ఉన్న  పిల్లల గొంతులను తువ్వాలుతో బిగించి లక్ష్మీప్రసన్న చంపిందని, తరువాత ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. తర్వాత అదే గదిలో ఫ్యాన్‌కు చీరతో లక్ష్మీప్రసన్న ఉరివేసుకుందని భావిస్తున్నారు.  

 
 

Related Stories