తాజా వార్తలు   ఆటో,ట్యాక్సీ లబ్దిదారులకు 2వ సారి 10 వేల.రూ చప్పున.. సీఎం | శుభవార్త.. 8 నుంచి ఏపీ లో హోటల్స్ తెరవడానికి పచ్చజెండా.. | ఇకపై భీమవరం మార్కెట్ రాత్రి 7 గంటల వరకు..MLA గ్రంధి.. | ట్రాంప్ సంచలనమ్ ..అమెరికాకు చైనా విమానాలు నిషేధం | తెలంగాణాలో3000 దాటిన కరోనా కేసులు..హైదరాబాద్ లో 2,105.. | తెలంగాణలో కొత్తగా 87కరోనా కేసులు..1,273 చికిత్స పొందుతున్నారు | ఏపీలో కొత్తగా 79 కరోనా కేసులు..967 మంది కి చికిత్స | ఏపీలో సచివాలయాలు రంగులు మార్చండి .సుప్రీం తీర్పు | దేశంలోఒక్క రోజులోసుమారు 9వేల కరోనా కేసులు..ఆ 2రాష్ట్రాలలో.. | దేశంలో ప్రజా ఆదరణతో టాప్ 4 సీఎం జగన్ .. |

భీమవరంలో రాత్రిళ్ళు ఆటో ప్రయాణికులను దోచే ముఠా అరెస్ట్

Updated: February 19, 2019

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: ఇటీవల  భీమవరం శివారు ప్రాంతాల నుండి రాత్రి పుట ఆటోల్లో ప్రయాణించే ప్రయాణికుల ను టార్గెట్ గా పెట్టుకొని వారినుండి నగదు, బంగారు ఆభరణాలు అపహరిస్తున్న నలుగురి ముఠాను అరెస్టు చేశామని నరసాపురం  డివిజన్  డిఎస్పీ, ఎన్ నాగేశ్వరరావు మీడియాకు తెలిపారు. భీమవరం శివారు గ్రామములు  కొడవలి నుండి  పాలకోడేరు పరిధిలో వాహన తనిఖీలు చేస్తుండగా ముందు ఆటో చెక్ చేస్తుండగా వెనుక  ఆటో దిగి పారిపోతున్న తాడేపల్లిగూడెం యాగర్లపల్లికి చెందిన కొల్లు పెంటమ్మ, వరసాని శివ, పరుపురెడ్డి శ్రీరామ్‌, పి.వరలక్ష్మిలను అదుపులోకి తీసుకుని విచారణ చేశామన్నారు. భీమవరం రెండోపట్టణపరిధి, పాలకోడేరు మండలాల్లో జరిగిన 3 కేసుల్లో 10 కాసుల బంగారు ఆభరణాలు వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. కార్యక్రమంలో సీఐ ఎస్‌ఎస్‌వీ నాగరాజు, ఎస్సై వెంకటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. 

 
 

Related Stories