తాజా వార్తలు   ఆటో,ట్యాక్సీ లబ్దిదారులకు 2వ సారి 10 వేల.రూ చప్పున.. సీఎం | శుభవార్త.. 8 నుంచి ఏపీ లో హోటల్స్ తెరవడానికి పచ్చజెండా.. | ఇకపై భీమవరం మార్కెట్ రాత్రి 7 గంటల వరకు..MLA గ్రంధి.. | ట్రాంప్ సంచలనమ్ ..అమెరికాకు చైనా విమానాలు నిషేధం | తెలంగాణాలో3000 దాటిన కరోనా కేసులు..హైదరాబాద్ లో 2,105.. | తెలంగాణలో కొత్తగా 87కరోనా కేసులు..1,273 చికిత్స పొందుతున్నారు | ఏపీలో కొత్తగా 79 కరోనా కేసులు..967 మంది కి చికిత్స | ఏపీలో సచివాలయాలు రంగులు మార్చండి .సుప్రీం తీర్పు | దేశంలోఒక్క రోజులోసుమారు 9వేల కరోనా కేసులు..ఆ 2రాష్ట్రాలలో.. | దేశంలో ప్రజా ఆదరణతో టాప్ 4 సీఎం జగన్ .. |

భారత్ కు చైనా హెచ్చరిక..దీటుగా సమాదానం ఇచ్చిన భారత్

Updated: February 12, 2019

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్:ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అరుణచల్‌ ప్రదేశ్‌ పర్యటన వివాదాస్పదంగా మారింది. పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనల కొరకు మోదీ నేడు (శనివారం) అరుణాచల్‌ ప్రదేశ్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. హొల్లొంగిలోని గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. రెండు దూరదర్శన్‌ ఛానల్స్‌ను ఆయన ప్రారంభించారు. 110 మెగావాట్ల పరే హైడ్రోఎలక్ట్రిక్‌ ప్లాంట్‌ను మోదీ జాతికి అంకితం చేశారు. దీనిపై సరిహద్దు దేశం చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వివాదాస్పద భూభాగంలో మోదీ పర్యటించారని ఇటువంటి చర్యలకు దిగి సరిహద్దు సమస్యలను మరింత క్లిష్టతరం చేయొద్దని భారత్‌ను హెచ్చరించింది.‘ద్వైపాక్షిక సంబంధాల నిబంధనలను దృష్టిలో ఉంచుకొని భారత్‌ ప్రవర్తించాలి. చైనా అభిప్రాయాలను గౌరవిస్తూ ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలను మెరుగుపరుచుకోవాలి. సరిహద్దు సమస్యలను వివాదం చేసే చర్యలకు భారత్‌ దూరంగా ఉండాలి’ అంటూ చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. 
చైనా బెదిరింపుల పై భారత విదేశాంగ శాఖ  దీటుగా స్పందించింది. అరుణాచల్ ప్రదేశ్‌ భారత్‌లో అంతర్భామేనని, తమదేశ నేతలు ఖచ్చితంగా పర్యటించి తీరుతారని తెగసి చెప్పింది.  ఇదే విషయాన్ని గతంలో అనేక సార్లు చైనాకు స్పష్టంగా చెప్పినట్లు భారత్‌ ప్రకటించింది.
 
 

Related Stories